దక్షిణాది చిత్రపరిశ్రమలో గ్లామర్ సెన్సేషన్ అంటే ఠక్కున గుర్తొచ్చే ముద్దుగుమ్మ ఆమె. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అద్భుతమైన ఆకర్షణీయమైన నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. వెంకటేశ్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. గ్లామరస్ బ్యూటీగా ఇండస్ట్రీలో అత్యధిక ఫాలోయింగ్ సంపాదించుకుంది. కానీ నెమ్మదిగా ఈ బ్యూటీకి అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె నటించిన చిత్రాలు సైతం అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో ఆమె నెమ్మదిగా సైలెంట్ అయ్యింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు 44 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇస్తుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ నమిత. గుర్తుందా.. ? తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : సందీప్ రెడ్డి వంగాకు మెసేజ్ చేసి పిచ్చోడిని అయిపోయా.. టాలీవుడ్ హీరో..
2002లో సొంతం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇందులో ఆర్యన్ రాజేశ్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత వెంకటేశ్ జోడిగా జెమిని సరసన నటించి మెప్పించింది. అయినప్పటికీ తెలుగులో ఆమెకు అంతగా అవకాశాలు మాత్రం రాలేదు. ఒక రాజు ఒక రాణి సినిమాలో కనిపించింది. 2004లో ప్రభుదేవా నటించిన ఎంగల్ అన్నా అనే సినిమాతో తమిళ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోయిన్ గా మారింది. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. చాలా కాలం తర్వాత ప్రభాస్ నటించిన బిల్లా సినిమాలో నటించింది. ఇందులో గ్లామర్ సెన్సేషన్ గా అలరించింది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : రజినీకాంత్ చేసిన ఆ ఒక్క హెల్ప్‌తో చిరంజీవి లైఫ్ మారిపోయింది.. టాలీవుడ్ నటుడు..
సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 2017లో వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి కవలలు జన్మించారు. సినిమాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి బీజేపీ పార్టీలో చేరింది నమిత. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. యూట్యూబర్ విజయ్ సిద్ధు దర్శకత్వం వహించిన తొలి చిత్రం ‘దయంగరం’ చిత్రంలో నమిత స్పెషల్ సాంగ్ చేసినట్లు టాక్.
ఎక్కువ మంది చదివినవి : Jagapathi Babu: ఆ హీరోను ప్రతిరోజూ తలుచుకుంటా.. బతికితే అతడిలా బతకాలి.. జగపతి బాబు..
ఎక్కువ మంది చదివినవి : Folk Singer : ఒక్క పాటతో యూట్యూబ్ సెన్సేషన్.. ఎర్ర ఎర్ర రుమాల్ పాటకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే..