Hyderabad: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. అప్పటి వరకు వైన్స్‌లు, బార్లు బంద్!

Hyderabad: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. అప్పటి వరకు వైన్స్‌లు, బార్లు బంద్!


Hyderabad: మందుబాబులకు బిగ్‌ అలర్ట్‌.. అప్పటి వరకు వైన్స్‌లు, బార్లు బంద్!

హోలీ పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా హైదరాబాద్‌ నగరంలో పోలీసులు కఠిన ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు. మార్చి 3న నేడు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు.. నగర పరిధిలో అన్ని వైన్స్, కల్లు కాంపౌండ్లు, బార్లు, క్లబ్‌లు మూసివేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. అయితే నిబంధనలు వ్యతిరేకంగా ఎవరైనా ఆదేశాలను పాఠించకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశ ఆరు.

అలర్లు చేస్తే కేసులు తప్పవు

నగరంలో ఎక్కడైనా, ఎవరైనా అల్లర్లు చేస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని హైదరాబాద్‌ వాసులకు పోలీసులు సూచించారు. హైదరాబాదీలు పోలీసులకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ శాంతియుతంగా సాంప్రదాయకమైన హోళీ పండగను జరుపుకోవాలని సీపీ సజ్జనార్ సూచించారు.

డీజేలను నో పర్మిషన్

ఇదే కాదు హోలీ పేరుతో రోడ్లపైకి వచ్చి రంగులు చల్లుతూ వాహనదారులకు ఇబ్బందులకు గురిచేయవద్దని అలా చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ అన్నారు. నేడు నగరంలో పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని, బైక్‌లు, కార్లలో గుంపులు, గుంపులుగా రోడ్లపైకి రావొద్దని పోలీసులు హెచ్చరించారు. అలాగే డీజేలు పెట్టిన జనాలను ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. నగరంలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *