Viral News: తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. డాక్టర్స్ ఏం చేశారంటే

Viral News: తనను కాటేసిన పాముతో హాస్పిటల్‌కు వచ్చిన యువకుడు.. డాక్టర్స్ ఏం చేశారంటే


తనను కాటేసిన పామును చంపి దాని కళేబరాన్ని తీసుకొని ఓ యువకుడు నేరుగా హాస్పిటల్‌కు వెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా కోవూరులో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోవ్వూరులోని భగత్ సింగ్ కాలనీకి చెందిన చెందిన వలీ అనే యువకుడు.. స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేసేందుకు వెళ్లాడు. అతను భోజనం చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన ఓ రక్తపింజరి అతన్ని కాటు వేసింది. దీంతో అప్రమత్తమైన యువకుడు ఆ పామునే చంపేసి, దాని కళేబరంతో నేరుగా హాస్పిటల్‌కు వెళ్లాడు.

చేతిలో పామును పట్టుకొని యువకుడు హాస్పిటల్‌లోకి రావడాన్ని చూసిన రోగులు, స్థానిక జనాలు, డాక్టర్లు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి ఉరుకులు పరుగులు పెట్టారు. చివరకు ఆ పాము చనిపోయిందని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన విషయం తెలిసి వైద్యులు అతనికి చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం నెల్లూరు జిల్లా హస్పిటల్‌కు తరలించారు.

అయితే పాము ఎందుకు తీసుకొచ్చావని వైద్యులు అతన్ని ప్రశ్నించగా యువకుడు చెప్పిన సమాధానం విని వైద్యులు ఆశ్చర్యపోయారు. తనను కరిచిన పాము ఏదో తనకు తెలియదు అని.. అందుకే డాక్టర్లకు క్లారిటీ ఇచ్చేందుకు నేరుగా పాము కళేబరాన్నే తీసుకు వచ్చినట్టు అతను తెలిపాడు. అయితే అతను పామును పట్టుకొని వస్తున్న దృశ్యాలు కొందరు వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది.

మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *