Telangana: ఐడియా అదుర్స్.. కోతులను అడవి బాట పట్టించేందుకు శాశ్వత పరిష్కారం ఇదిగో!

Telangana: ఐడియా అదుర్స్.. కోతులను అడవి బాట పట్టించేందుకు శాశ్వత పరిష్కారం ఇదిగో!


మెదక్, మార్చి 2: ఒకప్పుడు అడవికి పరిమితమైన కోతులు.. ఇప్పుడు జనావాసాలపై దండయాత్ర చేస్తున్నాయి. ఆహారంలేక పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ వద్ద ‘VOON HAND FOUNDATION’ ఒక అద్భుతమైన అడుగు వేసింది.

రహదారుల వెంట ప్రయాణించే వారు కోతులకు ఆహారం వేయడం వల్ల అవి రోడ్ల మీదకు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయి. దీనిని నివారించేందుకు ఫౌండేషన్ నిర్వాహకులు ఇక్కడ ఒక ‘మంకీ ఫుడ్ కలెక్షన్ స్టాల్ ను ఏర్పాటు చేశారు. ఎవరైనా కోతులకు ఆహారం అందించాలనుకుంటే నేరుగా రోడ్డుపై వేయకుండా, ఈ స్టాల్ వద్ద అందజేయాలి. ఫౌండేషన్ సిబ్బంది ఆ ఆహారాన్ని సేకరించి అడవి లోపల కోతులకు అందజేస్తారు. తద్వారా కోతులు రోడ్ల మీదకు రాకుండా అడవిలోనే ఉండేలా అలవాటు చేస్తున్నారు.

కోతులకు అడవిలో తిండిలేక పక్షుల గుడ్లను తింటున్నాయి. దీనివల్ల పక్షుల సంతతి తగ్గిపోయి, పొలాల్లో పురుగులు ఎక్కువై రైతులు కెమికల్స్ వాడుతున్నారు. ఆ ఆహారం తిని మనం రోగాల బారిన పడుతున్నాం. అందుకే అడవిలో 21 రకాల పండ్ల చెట్లను పెంచాలని నిర్ణయించుకున్నారు. కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి, వాటిని పూర్తిస్థాయిలో అడవి బాట పటిస్తున్నారు. కేవలం ఆహారం అందించడమే కాకుండా, అడవిలో 21 రకాల పండ్ల మొక్కలను నాటి కోతులకు సహజ సిద్ధమైన ఆహారం లభించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. కోతుల సంఖ్యను నియంత్రించేందుకు కుటుంబ నియంత్రణ చర్యలు కూడా చేపట్టనున్నారు. ఈ స్వచ్ఛంద సంస్థ చేస్తున్న కృషిని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా స్పందించి ఇలాంటి మరిన్ని స్టాల్స్ ఏర్పాటుకు సహకరించాలని వారు కోరుతున్నారు. ఏది ఏమైనా ఈ ఆలోచన మాత్రం బాగుంది కదా..

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *