IPL 2026: నెట్స్‌లో ధోని ప్రాక్టీస్ షురూ.. సర్ఫరాజ్ ఏం చేశాడో తెలుసా?

IPL 2026: నెట్స్‌లో ధోని ప్రాక్టీస్ షురూ.. సర్ఫరాజ్ ఏం చేశాడో తెలుసా?


IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు చెన్నైలో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు పూర్తి ఉత్సాహంతో ప్రాక్టీస్ మొదలుపెట్టింది. మాజీ భారత కెప్టెన్, సీఎస్‌కే దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ప్రస్తుత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, ఇతర ఆటగాళ్లు ఆదివారం తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు.

ఫ్రాంచైజీ హై-పర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రారంభమైన ఈ శిబిరంలో పలువురు భారతీయ ఆటగాళ్లు హాజరయ్యారు. అయుష్ మ్హాత్రే, ముకేష్ చౌదరి, రాహుల్ చహర్, ఉర్విల్ పటేల్, రామకృష్ణ ఘోష్, సర్ఫరాజ్ ఖాన్ తదితరులు శిక్షణలో పాల్గొన్నారు.

నెట్స్‌లో ధోనిపైనే ఫోకస్ పెంచిన సర్ఫరాజ్..

ప్రాక్టీస్ వీడియోలో ధోనీ, రుతురాజ్ గైక్వాడ్ పక్కపక్కనే నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించారు. ఈ సమయంలో సర్ఫరాజ్ ఖాన్ ధోనీ బ్యాటింగ్‌ను దగ్గరగా గమనిస్తూ ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. గైక్వాడ్ ధైర్యమైన ఫుట్‌వర్క్‌తో అద్భుత టచ్‌లో కనిపించడం గమనార్హం.

కొత్తగా జట్టులో చేరిన ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మ కూడా శిక్షణలో పాల్గొన్నారు. ప్రస్తుతం దేశీయ ఆటగాళ్లతోనే శిబిరం కొనసాగుతోంది.

అంతర్జాతీయ ఆటగాళ్ల చేరికపై అనిశ్చితి..

టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న భారత ఆటగాళ్లు సంజూ శాంసన్, శివమ్ దూబే టోర్నమెంట్ ముగిసిన తర్వాత (మార్చి 7 తరువాత) జట్టులో చేరనున్నారు. కర్ణాటక తరపున రంజీ ట్రోఫీ ఫైనల్ ఆడిన శ్రేయాస్ గోపాల్ కూడా తర్వాత క్యాంప్‌లో చేరనున్నాడు.

అసిస్టెంట్ కోచ్ శ్రీధరన్ శ్రీరామ్, రాజీవ్ కుమార్ పర్యవేక్షణలో శిక్షణ జరుగుతోంది. ఫిట్‌నెస్ కోచ్ గ్రెగ్ కింగ్ కూడా జట్టుతో ఉన్నారు. విదేశీ ఆటగాళ్లు, విదేశీ కోచింగ్ సిబ్బంది ఇంకా చేరలేదు.

సీఎస్‌కే స్క్వాడ్ – ఐపీఎల్ 2026..

రుతురాజ్ గైక్వాడ్, డేవాల్డ్ బ్రెవిస్, అయుష్ మ్హాత్రే, సర్ఫరాజ్ ఖాన్, మ్యాట్ షార్ట్, సంజూ శాంసన్, ఎంఎస్ ధోనీ, ఉర్విల్ పటేల్, కార్తిక్, శివమ్ దూబే, జాక్ ఫౌల్క్స్, రామకృష్ణ ఘోష్, శ్రేయాస్ గోపాల్, జేమీ ఓవర్టన్, అఖీల్ హోసేన్, అమన్ ఖాన్, వీర్, నూర్ అహ్మద్, రాహుల్ చహర్, ఖలీల్ అహ్మద్, నాథన్ ఎల్లిస్, మ్యాట్ హెన్రీ, గుర్జప్నీత్ సింగ్, అంషుల్ కాంబోజ్, ముకేష్ చౌదరి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *