అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ ఐసెట్ 2026) ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నోటిఫికేషన్ ప్రకారం ఐసెట్ దరఖాస్తు గడువు ఈ రోజు (మార్చి 2)తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన జారీ చేసింది. తాజా ప్రకటన మేరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 17వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించింది. ఈ ఏడాది ఐసెట్ పరీక్ష ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగనుంది. ఏపీ ఐసెట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. కాగా ఈ ఏడాదికి ఐసెట్ ప్రవేశ పరీక్ష మే 2న రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరగనుంది.
ముఖ్యమైన తేదీలు..
- ఏపీ ఐసెట్ 2026 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 17, 2026.
- రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: మార్చి 21, 2026.
- రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: మార్చి 25, 2026.
- రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: మార్చి 30, 2026.
- రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తు చివరి తేదీ: ఏప్రిల్ 3, 2026.
- దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 5, 2026.
- హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ: ఏప్రిల్ 15, 2026.
- ఏపీ ఐసెట్ 2026 పరీక్ష తేదీ: మే 2, 2026.
- ఏపీ ఐసెట్ 2026 ఫలితాలు విడుదల తేదీ: మే 16, 2026.
ఏపీ ఐసెట్ 2026 దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.