Sanju Samson: ఒక్క ఇన్నింగ్స్‌తో నోర్లన్నీ మూయించాడు.. రాసిపెట్టుకో.! ఆ పాక్ ప్లేయర్ గజగజ వణికిపోవాల్సిందే

Sanju Samson: ఒక్క ఇన్నింగ్స్‌తో నోర్లన్నీ మూయించాడు.. రాసిపెట్టుకో.! ఆ పాక్ ప్లేయర్ గజగజ వణికిపోవాల్సిందే


సంజూ శాంసన్.. వన్ మ్యాన్ ఆర్మీగా టీమిండియాను సెమీఫైనల్‌కు చేర్చాడు. ఈ గెలుపుతో అటు సంజూ శాంసన్, ఇటు మహమ్మద్ ఆమీర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. వెస్టిండీస్‌తో పాటు మహమ్మద్ అమీర్‌ను శాంసన్ ఒకేసారి ఇచ్చిపడేశాడని నెటిజన్లు అంటున్నారు. మహమ్మద్ అమీర్, ఇతర క్రిటిక్స్ భారత జట్టు సెమీఫైనల్‌కు అర్హత సాధించదని, అభిషేక్ శర్మ లాంటి ఆటగాళ్లను తక్కువ చేసి చూశారు. ఒక మ్యాచ్ ఓటమి ఆధారంగా భారత జట్టు సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయడం సరైంది కాదని ఇప్పుడు సంజూ స్పష్టం చేశాడు.

భారత జట్టు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆటగాళ్లు సరైన మ్యాచ్‌ల్లో అలరించలేకపోయినా.. బెంచ్ స్ట్రెంగ్త్ బలంగా ఉండటంతో.. సంజూ శాంసన్ లాంటి ప్లేయర్స్ తమ రోజు వచ్చినప్పుడు చెలరేగిపోతారని మరోసారి రుజువైంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మహమ్మద్ అమీర్ తన జట్టు ప్రదర్శనపై దృష్టి సారించాలని.. వాళ్లకు సూచనలు ఇవ్వడం మంచిదని.. టీమిండియాపై ఇంకోసారి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *