AP Lawcet 2026: ఏపీ లాసెట్‌, పీజీఎల్‌సెట్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?

AP Lawcet 2026:  ఏపీ లాసెట్‌, పీజీఎల్‌సెట్ దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?


అమరావతి, మార్చి 2: ఆంధ్రప్రదేశ్‌ లా కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏపీ లాసెట్‌ 2026), పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లా కోర్స్‌ ఎల్‌ఎల్‌ఎం (ఏపీ పీజీఎల్‌సెట్) 2026 దరఖాస్తు గడువు పొడిగిస్తూ ఏపీ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన వెలువరించింది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 12వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉంది. అయితే దానిని మార్చి 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొంది. దీంతో ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మార్చి 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించినట్లైంది. ఈ ఏడాది లాసెట్‌ పరీక్షను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో రెండేళ్ల, మూడేళ్ల, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఎంఎల్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే..

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: మార్చి 21, 2026.
  • రూ.1000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: మార్చి 24, 2026.
  • రూ.2000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: మార్చి 28, 2026.
  • రూ.4000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 1, 2026.
  • రూ.10,000 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్ 6, 2026.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు సవరణ తేదీలు: ఏప్రిల్ 8, 2026.
  • హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ తేదీలు: ఏప్రిల్ 20, 2026.
  • లాసెట్‌ ప్రవేశ పరీక్ష తేది: మే 4, 2026.
  • ఫలితాలు విడుదల తేదీ: మే 18, 2026.

ఏపీ లాసెట్‌, పీజీలాసెట్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *