Tiger: పులి వారానికి ఎన్ని కేజీల మాంసం తింటుందో తెల్సా.! వామ్మో చూస్తే నోరెళ్లబెడతారు

Tiger: పులి వారానికి ఎన్ని కేజీల మాంసం తింటుందో తెల్సా.! వామ్మో చూస్తే నోరెళ్లబెడతారు


తాడోబా అంధారి టైగర్ రిజర్వ్ డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్(DFO) ఆనంద్ రెడ్డి.. స్థానిక అడవుల్లో పులుల జీవనం, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన కీలక అంశాలను వివరించారు. పులులు స్వతంత్ర జీవులని, తల్లితో ఉన్న పిల్లలు తప్ప మిగిలినవి ఒంటరిగా తిరుగుతాయని తెలిపారు. వాటి చారలు మనుషుల వేలిముద్రల వలె ప్రత్యేకమైనవని, టైగర్ సెన్సస్‌లో ఈ చారలను ఉపయోగించడం శాస్త్రీయమైన పద్ధతి అని పేర్కొన్నారు. ఒక పెద్ద పులి (200-250 కేజీలు) వారానికి సుమారు 40 కేజీల మాంసం తింటుందని, పెద్ద వేటను పట్టుకుంటే ఎక్కువ రోజులు తినొచ్చని, లేదంటే రెండు, మూడు రోజుల్లో మళ్లీ వేటాడాల్సి వస్తుందని తెలిపారు. పులులు సాధారణంగా ఇండియన్ గార్ (బైసన్) వంటి పెద్ద జంతువులను వేటాడటానికి ఇష్టపడతాయి. తాడోబాలో టైగర్లతో పాటు చిరుతపులులు, అడవి కుక్కలు, ఎలుగుబంట్లు, ఇండియన్ గార్, సాంబార్, జింకలు వంటి 80కి పైగా క్షీరద జాతులు, 300 రకాల పక్షులు, 120కి పైగా సీతాకోకచిలుకలు ఉన్నాయి. వన్యప్రాణులకు ఏదైనా అనారోగ్యం వస్తే, కెమెరా ట్రాప్‌లు, సిబ్బంది పెట్రోలింగ్ ద్వారా గుర్తిస్తారు.

తాడోబాకు వచ్చే పర్యాటకులకు మొబైల్ ఫోన్‌లు, మద్యం, ధూమపానం పూర్తిగా నిషేధం అని ఆనంద్ రెడ్డి తెలిపారు. మొబైల్ ఫోన్‌లు జంతువులకు, ఇతర పర్యాటకులకు అంతరాయం కలిగించడంతో పాటు సెల్ఫీలు తీసే క్రమంలో ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని, మూడేళ్లుగా ఈ నిషేధం అమలులో ఉందని చెప్పారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 5,000 రూపాయల జరిమానాతో పాటు, మళ్లీ రిపీట్ చేస్తే బ్లాక్‌లిస్ట్ చేస్తామని హెచ్చరించారు. గైడ్‌లు ఈ నిబంధనలను పర్యవేక్షిస్తారని, వారు ఉల్లంఘిస్తే శాశ్వతంగా నిషేధిస్తారని స్పష్టం చేశారు. కోర్ ఏరియా బయట ఉన్న బఫర్ ఏరియాలో 80కి పైగా రిసార్ట్‌లు, 90 గ్రామాలు ఉన్నాయని, పర్యాటకులకు వసతి, ఆహార సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *