కాయ్ రాజా కాయ్ఎం.. త డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..

కాయ్ రాజా కాయ్ఎం.. త డబ్బు లెక్క పెడితే అంత సొమ్ము  మీదే.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌..


ఇలాంటి బాస్‌ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది అని ఉద్యోగులు ఈర్ష్య పడేలా చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్‌ యువాన్లు అంటే 240 కోట్ల రూపాయలు తన ఉద్యోగులకు బోనస్‌గా ఇచ్చారు. అది కూడా ఒక్కొక్కరికీ ఇంత మొత్తం అని కాకుండా టేబుళ్ల మీద నోట్ల కట్టలు పరిచి మీరు ఎంత లెక్కపెడతారో అంతా తీసుకుని వెళ్లమంటూ బంపరాఫర్‌ ఇచ్చారు. ఉద్యోగులు నోట్ల కట్టలు చేతిలో పట్టుకుని ఆనందంగా వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్‌ కావడంతో అందరూ కంపెనీ యజమాని కుయ్‌ పీజున్‌ పెద్దమనసును మెచ్చుకుంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హెనాన్‌ కువాంగ్‌షా క్రేన్‌ లిమిటెడ్‌ అనే కంపెనీ ఈ ఏడాది ఆర్జించిన 270 మిలియన్‌ యువాన్‌ల లాభంలో 70 శాతాన్ని తన ఉద్యోగులకే పంచేసింది. దీని కోసం పెద్ద హాల్‌లో 800 టేబుల్స్‌ వేసి వాటిపై కుప్పలు కుప్పలుగా నోట్లను పరిచింది. నిర్దేశిత సమయంలో ఉద్యోగులు అందులోంచి ఎన్ని నోట్లు లెక్కపెడతారో అవన్నీ వారివేనని ప్రకటించడంతో వారు చకచకా వాటిని లెక్కపెట్టి కట్టలు కట్టి ఆనందంగా తీసుకుపోయారు. నోట్లు వేగంగా లెక్కపెట్టడం కోసం కొందరైతే కొన్ని రోజుల పాటు శిక్షణ కూడా తీసుకున్నారని మీమ్స్‌ వచ్చాయి. సిబ్బందికి వాషింగ్‌ మెషీన్లు కూడా అందచేశారు. అంతేకాక కారు లోన్లు, మార్ట్‌గేజ్‌ లోన్లతో ఇబ్బంది పడుతున్న యువ సిబ్బంది తమను సంప్రదిస్తే ఆర్థికంగా సహాయం చేస్తామని ప్రకటించారు. కాగా, 2002లో స్థాపించిన ఈ కంపెనీ బ్రాంచ్‌లు 130 దేశాల్లో ఉన్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Holi: శ్మశానంలో మండుతున్న చితుల మధ్య “హోలీ’ ఎక్కడంటే..

Rashmika-Vijay Marriage: ‘విరోష్’ సునామీ.. సోషల్‌ మీడియాలో రికార్డ్‌ బద్దలు!

రీల్‌ తో చిక్కుల్లో పడ్డ పోలీసులు.. షోకాజ్‌ నోటీసులు..

ఈ జంట యమా ఫాస్ట్ గురూ.. పెళ్లి చేసుకున్న గంటకే విడిపోయారు

West Asia War: యుద్ధంపై భారత్‌ ఆందోళన.. ఎగుమతులపై తీవ్ర ప్రభావం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *