IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు.. ఐసీసీ రూల్‌తో సూర్యసేనకు షాకే..?

IND vs ENG సెమీఫైనల్‌కు వర్షం ఎఫెక్ట్.. రద్దైతే ఫైనల్ చేరేది ఎవరు.. ఐసీసీ రూల్‌తో సూర్యసేనకు షాకే..?


IND vs ENG semifinal cancelled rule: మొదటి సెమీఫైనల్‌లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ తలపడనుండగా, రెండో సెమీఫైనల్‌లో భారత్-ఇంగ్లాండ్ పోటీ పడనున్నాయి. భారత్-ఇంగ్లాండ్ మ్యాచ్ ఫిబ్రవరి 5న ముంబై వాంఖడే స్టేడియంలో జరగనుంది. అయితే ఈ కీలక మ్యాచ్ వర్షం లేదా ఇతర కారణాలతో రద్దయితే ఏమవుతుంది? అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.

సెమీఫైనల్ రద్దైతే ఏమవుతుంది?

గ్రూప్ దశ, సూపర్-8 దశల్లో మ్యాచ్ రద్దైతే ఇరు జట్లకు ఒక్కో పాయింట్ ఇచ్చేవారు. కానీ సెమీఫైనల్ నాకౌట్ మ్యాచ్ కావడంతో పరిస్థితి భిన్నంగా ఉంటుంది.

ఐసీసీ ఈ రెండు సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే కేటాయించింది. మ్యాచ్ డేలో వర్షం కారణంగా పూర్తి కాలేకపోతే, రిజర్వ్ డేలో మిగిలిన ఆటను పూర్తి చేస్తారు.

ఇది కూడా చదవండి: IND vs ENG: 3వసారి సెమీస్‌లో ఢీ కొట్టనున్న భారత్, ఇంగ్లాండ్.. గెలిచినోడిదే ట్రోఫీ..?

రిజర్వ్ డేలో కూడా ఫలితం రాకపోతే?

ఐసీసీ నిబంధనల ప్రకారం, నాకౌట్ దశలో (సెమీఫైనల్ లేదా ఫైనల్) మ్యాచ్ ఫలితం రాకపోతే, సూపర్-8 దశలో మెరుగైన స్థానం సాధించిన జట్టే ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

సూపర్-8లో గ్రూప్-2లో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. గ్రూప్-1 నుంచి భారత్ రెండో స్థానంలో సెమీఫైనల్‌కు చేరింది.

అందువల్ల భారత్-ఇంగ్లాండ్ సెమీఫైనల్ పూర్తిగా రద్దయితే, ఇంగ్లాండ్ ఫైనల్‌కు చేరుతుంది. భారత్ మ్యాచ్ ఆడకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది.

ఇది కూడా చదవండి: పక్కన పెట్టాల్సిన టైం వచ్చింది.! కాటేరమ్మ కొడుకును పీకేయండి మహాప్రభో.. నెటిజన్ల డిమాండ్

మొదటి సెమీఫైనల్ పరిస్థితి..

మార్చి 4న కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో దక్షిణాఫ్రికా-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరగనుంది. ఈ మ్యాచ్‌కూ రిజర్వ్ డే ఉంది.

అయితే అది కూడా ఫలితం లేకుండా ముగిస్తే, సూపర్-8లో అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికాకే ఫైనల్ టికెట్ లభిస్తుంది. న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది.

మొత్తానికి, సెమీఫైనల్ మ్యాచ్‌లకు రిజర్వ్ డే ఉన్నప్పటికీ, చివరికి సూపర్-8 ర్యాంకింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి వాతావరణ పరిస్థితులు కూడా జట్ల భవిష్యత్తును నిర్ణయించే అంశంగా మారాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *