అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?

అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సమయం దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆ తర్వాత రెండు సినిమాలు చేసి మెప్పించారు. హరిహరవీరమల్లు, ఓజీ సినిమాలతో ఆకట్టుకున్నారు. ఈ రెండు సినిమాల్లో ఓజీ మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు పవన్. ఇదిలా ఉంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుష్ చేశారు. ఆయన సినిమాలు రిజెల్ట్ తో సంబంధం లేకుండా అభిమానులను ఆకట్టుకునేవి అలాంటి వాటిలో గుడుంబా శంకర్ సినిమా ఒకటి.

గుడుంబా శంకర్ సినిమా ప్రేక్షకులను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటన, ఆయన మ్యానరిజం, యాటిట్యూడ్ అభిమానులకు పూనకాలు తెప్పించాయి. పవన్ కళ్యాణ్ సినిమాల్లో గుడుంబా శంకర్ సినిమాకు ఓ స్పెషాలిటీ ఉంది. ఈ మూవీలో పవన్ ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం అప్పట్లో సెన్సేషన్. డిఫరెంట్ స్టైల్‌తో కనిపించి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశారు పవన్. అలాగే ఆ తర్వాత వచ్చిన బాలు సినిమాలోనూ డిఫరెంట్ స్టైల్ ప్యాంట్ వేసి ట్రెండ్ సెట్ చేశారు.

అప్పట్లో ఈ ప్యాంట్లకు యమా క్రేజ్ ఉండేది బాలు ప్యాంట్స్‌గా బాగా పాపులర్ అయ్యాయి ఇవి. అయితే పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్‌లను ఎవరికీ గిఫ్ట్‌గా ఇచ్చారో తెలుసా..? ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్‌గా మారింది. పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను తన మేనల్లుడు సాయి దుర్గ తేజ్‌కు గిఫ్ట్‌గా ఇచ్చారట. ఆ ప్యాంట్‌లను తేజ్ తన మొదటి సినిమా రేయ్ లోనూ వాడారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అవవడంతో అది పెద్దగా హైలైట్ కాలేదు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *