PM Modi: ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ కీలక చర్చ.. యుద్ధపరిణామాలపై ఆరా.. ఉద్రిక్తతల తగ్గింపునకు సూచన

PM Modi: ఇజ్రాయెల్ ప్రధానితో మోదీ కీలక చర్చ.. యుద్ధపరిణామాలపై ఆరా.. ఉద్రిక్తతల తగ్గింపునకు సూచన


పశ్చిమాసియాలో వేగంగా మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో అత్యున్నత స్థాయి టెలిఫోన్ సంభాషణ జరిపారు. ఇరాన్ సుప్రీం నాయకుడు ఖమేనీ హత్య నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు, ఇరాన్ చేపట్టిన ప్రతీకార దాడుల నేపథ్యంలో ఈ చర్చ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ చర్చపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రాంతీయ పరిస్థితులను వివరంగా చర్చించామని తెలిపారు. “ఇటీవలి పరిణామాలపై భారత ఆందోళనలను నెతన్యాహుకు తెలియజేశాను. పౌరుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి. శత్రుత్వాలను త్వరగా నిలిపివేయాల్సిన అవసరం ఉంది” అని మోదీ స్పష్టం చేశారు.

యూఏఈకి భారత్ మద్దతు

ఆ తర్వాత ప్రధాని మోదీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో మాట్లాడారు. గల్ఫ్ దేశంపై జరిగిన దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్లిష్ట సమయంలో భారత్ యూఏఈకి పూర్తి సంఘీభావంగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా యూఏఈలో నివసిస్తున్న భారతీయ సమాజం భద్రతకు హామీచ ఇచ్చినందుకు యూఏఈ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ శాంతి, భద్రత మరియు స్థిరత్వానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *