రోజుకు కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం! LIC నుంచి సూపర్‌ స్కీమ్‌

రోజుకు కేవలం రూ.45 పొదుపుతో లక్షలు మీ సొంతం! LIC నుంచి సూపర్‌ స్కీమ్‌


పెట్టుబడిలో భద్రతతో పాటు స్థిరమైన రాబడి కోరుకునే వారికి జీవిత బీమా పథకాలు ఇప్పటికీ విశ్వసనీయ ఎంపికగా ఉన్నాయి. ముఖ్యంగా LIC అందించే ‘జీవన్ ఆనంద్’ (ప్లాన్ నం. 915) పథకం మళ్లీ చర్చలోకి వచ్చింది. బీమా రక్షణతో పాటు పొదుపు ప్రయోజనం కలిపిన ఈ పాలసీ సామాన్యులకు అనుకూలంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పథకంలో ప్రీమియం భారంగా ఉండదు. ఉదాహరణకు 35 ఏళ్ల వ్యక్తి రూ.5 లక్షల సమ్ అష్యూర్డ్‌తో 35 సంవత్సరాల కాలానికి పాలసీ తీసుకుంటే సంవత్సరానికి సుమారు రూ.16,300 చెల్లించాలి. ఇది నెలకు దాదాపు రూ.1,400 లేదా రోజుకు రూ.45–46 మాత్రమే. దీర్ఘకాలంగా చూస్తే చిన్న మొత్తంతో పెద్ద ఫండ్ సృష్టించే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత బోనస్ అంచనాల ప్రకారం పాలసీ మెచ్యూరిటీ సమయంలో పెట్టుబడిదారుడికి సుమారు రూ.25 లక్షల వరకు లభించే అవకాశం ఉంది. ఇందులో రూ.5 లక్షల హామీ మొత్తం, దాదాపు రూ.8.60 లక్షల సింపుల్ రివిజనరీ బోనస్, సుమారు రూ.11.50 లక్షల తుది అదనపు బోనస్ ఉంటాయి. ఈ పథకంలో ప్రధాన ఆకర్షణ ‘హోల్ లైఫ్ కవర్’. చాలా పాలసీలు మెచ్యూరిటీతో ముగిసిపోతాయి. కానీ జీవన్ ఆనంద్‌లో మెచ్యూరిటీ తర్వాత కూడా రూ.5 లక్షల రిస్క్ కవర్ జీవితాంతం కొనసాగుతుంది. పాలసీదారు తరువాత మరణించినా నామినీకి ఈ మొత్తం చెల్లించబడుతుంది.

పన్ను మినహాయింపులు

ఈ పాలసీ కింద చెల్లించే ప్రీమియం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద మినహాయింపుకు అర్హం. మెచ్యూరిటీ, మరణ ప్రయోజనం సెక్షన్ 10(10D) ప్రకారం పన్ను రహితం. రెండు సంవత్సరాల తర్వాత పాలసీపై రుణం తీసుకునే అవకాశం కూడా ఉంది. తక్కువ ప్రీమియంతో బీమా రక్షణతో పాటు దీర్ఘకాలిక పొదుపు కోరుకునే వారికి జీవన్ ఆనంద్ పథకం సమతుల్య ఎంపికగా నిలుస్తోంది. అయితే పాలసీ కొనుగోలు చేసే ముందు వ్యక్తిగత ఆర్థిక లక్ష్యాలు, రాబడి అంచనాలు జాగ్రత్తగా పరిశీలించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *