ఈడెన్‌లో సిక్సర్ల సునామీ.. పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?

ఈడెన్‌లో సిక్సర్ల సునామీ.. పాక్ ప్లేయర్ భారీ రికార్డ్ బ్రేక్ చేసిన డేంజరస్ బ్యాటర్.. ఎవరంటే?


Shimron Hetmyer Most Sixes Record: టీ20 వరల్డ్ కప్ 2026లో వెస్టిండీస్ తరపున అత్యుత్తమ బ్యాటర్‌గా నిలుస్తున్న షిమ్రోన్ హిట్‌మైర్ మరో ఘనత సాధించాడు. భారత్‌తో జరిగిన వర్చువల్ నాకౌట్ మ్యాచ్‌లో ఈ ఎడమచేతి బ్యాటర్ పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ రికార్డును అధిగమించాడు.

హిట్‌మైర్ ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుకు కావాల్సిన రెండు సిక్స్‌లను స్టైలిష్‌గా పూర్తి చేశాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో భారీ సిక్స్ కొట్టి ఫర్హాన్‌ను దాటేశాడు.

ప్రస్తుతం హిట్‌మైర్ ఖాతాలో 19 సిక్స్‌లు ఉన్నాయి. అంతకుముందు 2026 ఎడిషన్‌లోనే సాహిబ్జాదా ఫర్హాన్ 18 సిక్స్‌లతో అగ్రస్థానంలో ఉన్నాడు.

ఒకే ఎడిషన్‌లో అత్యధిక సిక్స్‌లు (టీ20 వరల్డ్ కప్)..

19 – షిమ్రోన్ హిట్‌మైర్ (వెస్టిండీస్) – 2026*

18 – సాహిబ్జాదా ఫర్హాన్ (పాకిస్థాన్) – 2026

17 – నికోలస్ పూరన్ (వెస్టిండీస్) – 2024

16 – క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 2012

16 – రహ్మానుల్లా గుర్బాజ్ (అఫ్గానిస్తాన్) – 2024

హిట్‌మైర్ ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతున్నాడు. అతని పవర్ హిట్టింగ్ వెస్టిండీస్ విజయాలకు కీలకంగా మారింది.

ఈ రికార్డుతో హిట్‌మైర్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మరో మైలురాయిని అందుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *