Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!

Credit Card: క్రెడిట్‌ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఇది తెలుసుకోవాల్సిందే..!


Credit Card: ఈ రోజుల్లో క్రెడిట్‌ కార్డు వాడకం అనేది సర్వసాధారణం అయ్యింది. చాలా మందికి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులు ఉంటున్నాయి. అయితే క్రెడిట్‌ కార్డుల విషయంలో కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే ఆ కార్డ్ పైన ఉన్న అప్పు ఎవరు చెల్లించాలి అనే సందేహం చాలామందికి ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆ అప్పుని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. చనిపోయిన వ్యక్తి ఆస్తుల నుండి బ్యాంకు ఆ బ్యాలెన్స్‌ని డిడెక్ట్ చేసుకోవాలి.

అయితే, ఒకవేళ మీరు జాయింట్ హోల్డర్ లేదా కో-సైనర్ అయినట్లయితే, ఆ వ్యక్తి చనిపోయినా కూడా ఆ క్రెడిట్ కార్డ్ అప్పుకు మీరు వ్యక్తిగతంగా బాధ్యత వహిస్తారు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డ్ విషయంలో FD అమౌంట్ నుండి క్రెడిట్ కార్డ్ అప్పు, వడ్డీని కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ నామినీకి అందజేస్తారు.

ఇది కూడా చదవండి: Scooters Warranty: 10 సంవత్సరాల పాటు వారంటీతో వచ్చే స్కూటర్లు!

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన విషయం ఏమిటంటే, మరణించిన వ్యక్తి క్రెడిట్ కార్డ్ క్రెడెన్షియల్స్ తెలుసు కదా అని ఆ కార్డును వాడితే అది మోసంగా పరిగణిస్తారు. చనిపోయిన వ్యక్తి క్రెడిట్‌ కార్డును ఎవ్వరు కూడా వాడవద్దు. ఆ కార్డును బ్యాంకులో అందించాల్సి ఉంటుంది. వ్యక్తి చనిపోయిన వెంటనే బ్యాంకుకు వారి డెత్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. అలా చేస్తే క్రెడిట్ కార్డ్ అప్పు మీద అదనపు వడ్డీ లెక్కించరు. బ్యాంకు, కుటుంబ సభ్యులను అప్పు చెల్లించమని బలవంతం చేయడానికి అవకాశం లేదు. చనిపోయిన వ్యక్తికి ఆస్తులు లేకపోతే, బ్యాంకు ఆ అప్పుని నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)గా రైట్ ఆఫ్ చేస్తుంది.

ఇది కూడా చదవండి: మీరు హైవేపై కారులో రయ్యుమంటూ స్పీడ్‌గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *