టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ

టీ20 ప్రపంచకప్ 2026 నుంచి ఔట్.. కట్‌చేస్తే.. బాబర్‌తోపాటు పాక్ కెప్టెన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన పీసీబీ


Pakistan T20 Team Overhaul 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ముగిసిన వెంటనే పాకిస్థాన్ టీ20 జట్టులో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశమున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) టీ20 కెప్టెన్ సల్మాన్ అలీ ఆగాను పదవి నుంచి తప్పించే అవకాశముందని సమాచారం. పాక్ జట్టు సెమీస్ చేరకుండానే ఇంటి బాట పట్టింది. దీంతో ఈ నిర్ణయం అమలవుతుందని తెలుస్తోంది. అలాగే, కొంతమంది సీనియర్ ఆటగాళ్లు కూడా తమ చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడుతున్న పరిస్థితి ఉండొచ్చని రిపోర్టులు చెబుతున్నాయి.

నక్వీ అసంతృప్తి..

పీటీఐ నివేదిక ప్రకారం, పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ టీ20 వరల్డ్ కప్ ప్రచారంపై సంతృప్తిగా లేరట. సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్, బోర్డు అధికారులు జట్టు బాగా సిద్ధమైందని హామీ ఇచ్చారని, కానీ ఫలితాలు ఆశించిన విధంగా రాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో సల్మాన్ అలీ ఆగాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించాలనే నిర్ణయానికి నక్వీ వచ్చినట్లు తెలుస్తోంది.

బాబర్ ఆజమ్ భవిష్యత్తుపై నీలిమేఘాలు..?

సల్మాన్‌తో పాటు బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్ వంటి కొంతమంది సీనియర్ ఆటగాళ్ల టీ20 అంతర్జాతీయ కెరీర్ కూడా ముగింపు దశకు చేరే అవకాశముందని సమాచారం. 145 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బాబర్ ఆజమ్ భవిష్యత్తు కూడా అంధకారంలో పడింది. ఇప్పటికే శ్రీలంకతో జరిగిన చివరి గ్రూప్ పోరు నుంచి ఈ దిగ్గజ ఆటగాడిని తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో బాబర్ టీ20 కెరీర్ ముగిసే అవకాశముంది.

భవిష్యత్ కెప్టెన్ ఎవరు?

పాకిస్థాన్ కొత్త కెప్టెన్‌గా షాదాబ్ ఖాన్, షాహీన్ షా ఆఫ్రిది పేర్లు వినిపిస్తున్నాయి. ఆధునిక టీ20 క్రికెట్ అవసరాలకు సరిపోయే యువ జట్టును నిర్మించాలనే ఆలోచనలో కోచ్ మైక్ హెసన్ ముందుగానే బోర్డుతో చర్చించినట్లు సమాచారం. టోర్నమెంట్ తర్వాత పాకిస్థాన్ టీ20 సెటప్‌లో పెద్ద మార్పులు తప్పవని అంచనా.

మొత్తానికి, టీ20 వరల్డ్ కప్ 2026 తర్వాత పాకిస్థాన్ జట్టులో కొత్త దశ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సల్మాన్ ఆగా కెప్టెన్సీ ముగింపు, బాబర్ ఆజమ్ భవిష్యత్తు, యువతకు అవకాశాలు.. ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టమవుతాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *