King Cobra Video: కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..? ఒళ్లు జలదరించే సీన్..

King Cobra Video: కోపంతో తిరగబడిన నాగుపామును ఎప్పుడైనా చూశారా..? ఒళ్లు జలదరించే సీన్..


ఇండియన్ స్పెక్టికల్ కోబ్రా..! ఎస్… అత్యంత విషపురితమైన పాము జాతుల్లో ఒకటి.. కోపం వస్తే పడగ విప్పి భుసలు కొడుతుంది. తనకు తాను రక్షించుకునేందుకు కాటు వేస్తోంది. నాగు పాము విషం అత్యంత ప్రమాదకరమైనది. కాటు వేసిన వెంటనే సరైన వైద్యం అందకపోతే ప్రాణాలు పోతాయి. అప్పుడే పుట్టిన పిల్ల నాగుకు కూడా విషపు గ్రంధులుంటాయి. పిల్లనాగులు కూడా పడగ విప్పుతాయి. అందుకే.. మిగతా పాముల మాటేమో గాని.. నాగుపాము కనిపించగానే వణికిపోతుంటారు జనం. ఆ పాము కనిపిస్తే పరిసర ప్రాంతాల్లోకి ఎవరు వెళ్ళే సాహసం చేయరు. ఎస్.. అటువంటి పరిస్థితి ఎదురయింది విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్‌లో..

స్టీల్ ప్లాంట్ సెక్టర్ 3 లోని భారీ నాగుపాము హడలెత్తించింది. క్వార్టర్ నెంబర్ 439 ఆవరణలో కనిపించిన నాగుపాము మెట్ల కింద తిష్ట వేసి కూర్చుంది. అటుగా వెళ్లిన ఆ క్వార్టర్ లోని వాళ్ళు.. నాగుపామును చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భయంతో అరుపులు కేకలు పెట్టి పరుగులు తీశారు. దీంతో చుట్టుపక్కల వారంతా హుటాహుటిన వచ్చారు. చూస్తే నాలుగు అడుగుల భారీ నాగుపాము అది. జనాల అలికిడితో పడగవిప్పి బుసలు కొట్టడం ప్రారంభించింది. వెంటనే స్థానికులు.. పాములు పట్టడంలో నేర్పరి అయిన స్నేక్ క్యా్చర్ కిరణ్ కు సమాచారం అందించారు.

వీడియో చూడండి..

స్పాట్ కు చేరుకున్న కిరణ్.. నాగుపామును చాకచక్యంగా రెస్క్యూ చేశాడు. ఈ క్రమంలో అప్పటికే కోపంతో ఉన్న ఆ నాగుపాము.. పడగ విప్పి భారీ శబ్దంతో బుసలు కొడుతూ ఉంది. పామును పట్టుకున్న తర్వాత కూడా అది కోపంతో దాడి చేసేందుకు ఎదురు తిరిగింది. చాకచక్యంగా కిరణ్ పామును రెస్క్యూ చేసి బంధించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. జీవ వైవిధ్యంలో కీలక పాత్ర పోషించే పాములు ఎక్కడ కనిపించినా వాటికి హాని తలపెట్టకుండా సమాచారం ఇవ్వాలని కొడుతున్నాడు స్నేక్ కేచర్ కిరణ్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *