Andhra: అమ్మా చనిపోతున్నా.. వీడియో పంపిన కూతురు.. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే..

Andhra: అమ్మా చనిపోతున్నా.. వీడియో పంపిన కూతురు.. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే..


పోలీసులంటే చాలామంది భయపడతారు.. ఖాకీ డ్రెస్సులో వాళ్లు కఠినంగా ఉంటారని భావిస్తారు.. కానీ ఎవరికైనా ఆపద వస్తే సర్వశక్తులొడ్డి వారిని గట్టెక్కించడంలో ముందు వరుసలో ఉంటారు పోలీసులు. విశాఖలో.. బలవన్మరణానికి సిద్ధమైన ఓ యువతిని ప్రాణాలు కాపాడి శభాష్ అనిపించుకున్నారు పోలీసన్నలు.. వివరాల్లోకి వెళ్తే.. మరి పొలం ప్రాంతానికి చెందిన ఒక యువతి ఏయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ చదువుతోంది. ఆమెకు ఏ కష్టం వచ్చిందో ఏమో కానీ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇక జీవితం చాలు అనుకొని.. సముద్రం వైపు వెళ్లింది. వుడా పార్క్ బీచ్ లో ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయింది.

బీచ్ నుంచి కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి తీవ్ర మనోవేదనకు గురైంది. తాను చనిపోతానని వీడియో రికార్డ్ చేసి తల్లికి పెట్టింది. దీంతో తీవ్ర ఆందోళన యువతి కుటుంబ సభ్యులు.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అలర్ట్ అయిన 3 టౌన్ సిఐ పైడయ్య.. సమీపంలో కానిస్టేబుల్ పోలా రాజు ను అలర్ట్ చేశారు. లైట్ హౌస్ యువతి ఉన్నట్టు లొకేట్ చేసుకొని.. లైఫ్ గార్డ్ పోలా రావుతో కలిసి స్పాట్ కు హుటాహుటిన చేరుకున్నారు.

ఆత్మహత్య చేసుకోబోతున్న యువతని.. రెస్యూ చేశారు పోలీసులు. కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. సకాలంలో స్పందించి యువతి ఆత్మహత్యాయత్నం నుంచి సేఫ్గా కాపాడిన పోలీసులను అభినందించారు సీపీ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *