Iran Israel War: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!

Iran Israel War: ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ రక్షణ మంత్రి మృతి!


ఇరాన్‌పై దాడులు ప్రారంభించిన అమెరికా, ఇజ్రాయెల్‌ లక్ష్యాలు అంతా ఈజీగా నెరవేరే పరిస్థితులు కనిపించడం లేదు. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ టార్గెట్‌గా ఇరుదేశాలు భీకర దాడులను ప్రారంభించాయి. కాని ఖమేనీ మాత్రం అజ్ఞాత ప్రదేశంలోని ఓ బంకర్‌లో ఆశ్రయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల్లో ఇరాన్‌ రక్షణ శాఖ మంత్రి అజీజ్‌ నసీర్‌జాదే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పక్పూర్ చనిపోయినట్టు రాయిటర్స్‌ వార్తా సంస్థ వెల్లడించింది. సుప్రీం లీడర్‌ ఖమేనీ మాత్రం సురక్షితంగానే ఉన్నారని ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి అర్గాచీ ప్రకటించింది.

ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో అమెరికా-ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎదురుదాడి ప్రారంభించింది. ఇజ్రాయెల్‌ లోని పలు నగరాలపై ఏకకాలంలో డ్రోన్లతో , మిస్సైళ్లతో విరుచుకుపడింది. రాజధాని టెల్‌ అవీవ్‌తో పాటు పలు నగరాల్లో అపారనష్టం జరిగింది. అయితే ఇరాన్‌కు చైనాతో పాటు రష్యా పరోక్షంగా సహకారం అందిస్తునట్టు వార్తలు వస్తున్నాయి. చైనా శాటిలైట్ల సాయంతో అమెరికా స్థావరాలపై ఇరాన్‌ దాడులు చేస్తునట్టు అనుమానిస్తున్నారు. బహ్రేన్‌లో అమెరికా నేవీ స్థావరంలో రాడార్‌ వ్యవస్థను మిస్సైల్‌ దాడితో ఇరాన్‌ ధ్వంసం చేసింది. అంతేకాదు తమ దాడిలో అమెరికా యుద్ద నౌకలు కూడా ధ్వంసమైనట్టు ఇరాన్‌ ప్రకటించింది.

ఇక ఒకే సారి ఇరాన్ ఇజ్రాయెల్‌,కువైట్‌ , బహ్రేయిన్‌ , సౌదీ అరేబియా , జోర్డాన్‌ , కువైట్‌ ,ఇరాక్‌ ,ఖతార్‌ దేశాలపై క్షిపణి దాడులు చేసింది. దుబాయ్‌లో ఇరాన్‌ మిస్సైల్‌ దాడిలో ఒకరు చనిపోయారు. అలాగే ఖతార్‌ రాజధాని దోహాలో ఇరాన్‌ దాడితో భారీ నష్టం జరిగింది. పలు భవనాలు ధ్వంసమయ్యాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *