నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!

నాన్న లేకే ఇన్ని కష్టాలు! కానిస్టేబుల్ దివ్య సూసైడ్ నోట్ కలకలం!


వికారాబాద్‌లోని సాయిబాబా కాలనీలో మహిళా కానిస్టేబుల్ దివ్య ఆత్మహత్య చేసుకున్నారు. కోట్‌పల్లి పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న ఆమె ధారూర్ CI కార్యాలయానికి అటాచ్‌గా పని చేస్తున్నారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించిన దివ్య, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఆమె రాసిన సూసైడ్ నోట్ కలకలం సృష్టించింది. దివ్య తన నోట్‌లో తన చావుకు ఎవరూ కారణం కాదని స్పష్టంగా పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి లేని లోటు తనను తీవ్రంగా వేధించిందని, దాని వల్లనే ఇన్ని కష్టాలు వచ్చాయని రాశారు. మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నానని, అమ్మకు భారం కాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నానని దివ్య ఆవేదన వ్యక్తం చేశారు. “నాన్నే ఉంటే బాగుండే అమ్మా. ఆయన లేనందుకే ఇన్ని కష్టాలు. నన్ను క్షమించు అమ్మా” అని నోట్‌లో రాస్తూ, కుటుంబ సభ్యులందరినీ క్షమించమని వేడుకున్నారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో విషాదం నింపింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Europe Trip: తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు.. మొదలైన యుద్ధం

రైల్వే పరీక్షా తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్‌లైన్ మోసం..

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *