Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్

Anil Ravipudi: దగ్గుబాటితో నందమూరి.. అనిల్ ప్లాన్ అదుర్స్


అనిల్ రావిపూడి నెక్ట్స్ సినిమా ఏంటి ఏంటంటూ ఇన్నాళ్ళుగా నడుస్తున్న సస్పెన్స్‌కు అదిరిపోయే వీడియోతో ఆన్సర్ ఇచ్చారీయన. ఎవరూ ఊహించని విధంగా రెండు పెద్ద కుటుంబాల హీరోలను కలిపేస్తున్నారు. ఆస్థాన హీరోతో పాటు.. తనకు దర్శకుడిగా జన్మనిచ్చిన హీరోను కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి తెచ్చేసారు. మరి ఈ క్రేజీ కాంబినేషన్‌పై ఓ లుక్కేద్దామా..? మన శంకరవరప్రసాద్ గారు తర్వాత అనిల్ రావిపూడి తర్వాతి సినిమాపై ఆసక్తి పెరిగిపోయింది. వెంకటేష్‌తో ఉంటుందని తెలుసు కానీ అందులో మరో హీరో కూడా ఉంటాడని తెలియడంతో.. అదెవ్వరనే దానిపై చర్చ బాగా జరిగింది. కొందరు హీరోల పేర్లు వినిపించినా.. చివరికి కళ్యాణ్ రామ్‌ను ఫైనల్ చేసి దగ్గుబాటి, నందమూరి హీరోలను ఒకే ఫ్రేమ్‌లో చూపించబోతున్నారు అనిల్. అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ కామెడీ, ఎమోషన్స్‌తో పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది ఈ మల్టీస్టారర్. వెంకటేష్ కామెడీ టైమింగ్, కళ్యాణ్ రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా స్క్రిప్ట్ రెడీ అయిందంటున్నారు అనిల్. సంక్రాంతికే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. పటాస్ తర్వాత మరోసారి కళ్యాణ్ రామ్‌తో సినిమా చేయబోతున్నారు అనిల్ రావిపూడి. తనకు మొదటి 100 కోట్ల బొమ్మ ఇచ్చిన హీరోతో.. తనకు మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరోని కలపడం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేసారు అనిల్ రావిపూడి. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది. ఇందులో కళ్యాణ్ రామ్ పెద్ద పాత్రే చేయబోతున్నారు. మొత్తానికి మొన్న చిరంజీవి, వెంకీని కలిపిన అనిల్.. ఈసారి కళ్యాణ్ రామ్‌ను జత చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Pothineni: వరుస ఫెయిల్యూర్స్ తో.. కన్‌ఫ్యూజ్ అవుతున్న రామ్ పోతినేని

Samyuktha Menon: LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్

Suriya: కోలీవుడ్ టు టాలీవుడ్.. హిట్ కోసం సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా

వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌

సక్సెస్‌లు నిల్లు.. రెమ్యూనరేషన్ మాత్రం ఫుల్.. తగ్గదేలే అంటున్న ముద్దుగుమ్మ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *