అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం


హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో అది అర్ధరాత్రి సమయం.. కాలనీ అంతా గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా ఒకే చోట పెద్ద ఎత్తున టపాసులు పేలుతున్న శబ్దాలు. ఏవైనా వేడుకలా? అంటే అదీ కాదు. గత రెండు రోజులుగా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల హిల్స్ జైల్ కాలనీలో జరుగుతున్న ఈ ఘటన స్థానికులను హడలెత్తిస్తోంది. ప్రతిరోజూ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఒకే ఇంటి ముందు 240 షాట్స్ ఉండే భారీ టపాసులను నిప్పంటించి కొందరు దుండగులు పరారవుతున్నారు. ఎటువంటి సందర్భం లేకపోయినా, వరుసగా రెండు రోజులు ఒకే సమయానికి ఇలా జరగడంతో కాలనీ వాసులు తొలుత అది ‘కొరివి దయ్యం’ ఏమోనని భయాందోళన చెందారు. అయితే, సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా అసలు నిజం బయటపడింది. అర్ధరాత్రి ఇలా టపాసులు కాల్చి పారిపోతున్నారని, దీని వల్ల వాహనాలు, ఇళ్లకు నష్టం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. మద్యం మత్తులో ఆకతాయిలు చేస్తున్న ఈ చేష్టలను ఖండిస్తూ.. ఇలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు మీర్‌పేట్ పోలీసులను కోరుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా మీర్పేట్ విచారణ చేపట్టారు. మీర్పేట్ ప్రాంతంలో గంజాయి వినియోగం అధికంగా ఉంటున్నందున బహుశా గంజాయి మత్తులో ఆకతాయిలు చేసిన పనిగా పోలీసుల అనుమనిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

Lunar Eclipse 2026: చంద్రగ్రహణం నాడు ఈ రాశుల వారు జాగ్రత్తగా ఉండాల్సిందే

Driving Licence: ఇకపై గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్స్‌.. కేంద్రం కొత్త విధానం

దారుణం.. మనిషి చనిపోయినా పట్టించుకోకుండా.. చేపల కోసం ఎగబడ్డ జనం

Vishnu Vinyasam:విష్ణు విన్యాసం లో ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఇవే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *