
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు జరగడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి.. మరికొంత మంది పరిస్ధితి సీరియస్ గా ఉన్నట్లు పేర్కొంటున్నారు. మంటల్లో పలువురు కార్మికులు చిక్కుకున్నారు.. ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో 20 మంది కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది…బ్లాస్ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు..