Deepika Padukone: దీపికా పదుకొనెకు ఏమైంది? ‘ఆడిషన్’ కారణంగా చేజారిన హాలీవుడ్ సిరీస్!!!

Deepika Padukone: దీపికా పదుకొనెకు ఏమైంది? ‘ఆడిషన్’ కారణంగా చేజారిన హాలీవుడ్ సిరీస్!!!


Deepika Padukone..

టాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు ఆమె చుట్టూ ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు సరైనవేనా? లేక ‘ఈగో’ ఆమె కెరీర్‌ను దెబ్బతీస్తోందా? ఆమె ఒకప్పుడు బ్యాడ్మింటన్ కోర్టులో మెరిసింది.. ఆ తర్వాత వెండితెరపై మాయాజాలం చేసింది. షారుఖ్ ఖాన్ నుండి ప్రభాస్ వరకు అగ్ర హీరోల సరసన నటిస్తూ కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటోంది. అంతర్జాతీయ వేదికలపై భారతీయ సినిమా ఖ్యాతిని చాటిన ఆ స్టార్ హీరోయిన్, ఇప్పుడు వరుసగా క్రేజీ ప్రాజెక్టుల నుండి తప్పుకోవడం సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలో హాలీవుడ్ హీరో విన్ డీజిల్ సరసన మెరిసిన ఆమె, మళ్ళీ అక్కడ కమ్‌బ్యాక్ ఇచ్చే గొప్ప అవకాశాన్ని చేజేతులా వదులుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ గ్లోబల్ బ్యూటీ మరెవరో కాదు.. దీపికా పదుకొనె.

ఆడిషన్ వివాదం

తాజా సమాచారం ప్రకారం, హాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ‘ది వైట్ లోటస్’ (The White Lotus) వెబ్ సిరీస్ 4వ సీజన్ కోసం మేకర్స్ దీపికాను సంప్రదించారట. అయితే, ఈ సిరీస్‌లో నటించాలంటే ఖచ్చితంగా ‘ఆడిషన్’ ఇవ్వాలని మేకర్స్ నిబంధన పెట్టారట. అంతర్జాతీయ స్థాయిలో ఇంత గుర్తింపు ఉన్న తాను ఇప్పుడు ఆడిషన్ ఇవ్వడం ఏంటని దీపికా భావించినట్లు ఫిలిం నగర్ టాక్. తన స్థాయికి ఇది సరికాదని భావించి ఆమె ఆ ఆఫర్‌ను తిరస్కరించిందట. దీంతో నెటిజన్లు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. “హాలీవుడ్‌లో ఎంతటి స్టార్లకైనా ఆడిషన్ తప్పనిసరి, కేవలం ఈగో వల్లే మంచి ఛాన్స్ మిస్ చేసుకుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Spirit And The White Lotus

Spirit And The White Lotus

ప్రాజెక్టుల నుండి ఎగ్జిట్..

కేవలం హాలీవుడ్ మాత్రమే కాదు, టాలీవుడ్‌లో కూడా దీపికా వరుస ప్రాజెక్టుల నుండి తప్పుకుంటోంది. రెబల్ స్టార్ ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న ‘స్పిరిట్’ నుండి ఆమె తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. పని గంటలు, రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన విభేదాలే దీనికి ప్రధాన కారణమని సమాచారం. అలాగే ‘కల్కి 2’ విషయంలో కూడా ఆమె వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. వరుసగా పాన్ ఇండియా చిత్రాలను వదులుకోవడం ఆమె కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

వార్తలు ఎలా ఉన్నా, దీపికా చేతిలో మరికొన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’ సినిమాలో నటిస్తోంది. అలాగే మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన ఒక భారీ చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతోంది. మరి ఈ కొత్త ప్రాజెక్టులతోనైనా ఆమె మళ్ళీ తన ఫామ్‌ను నిరూపించుకుంటుందో లేదో చూడాలి. అగ్ర నటిగా ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు పాటించడం సాధారణమే అయినా, అవకాశాల విషయంలో పట్టువిడుపులు అవసరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *