ముగ్గురు మొనగాళ్లు.. బాక్సాఫీస్‌పై దండయాత్ర

ముగ్గురు మొనగాళ్లు.. బాక్సాఫీస్‌పై దండయాత్ర


నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ దగ్గర కుర్ర హీరోల కౌంట్‌డౌన్ మొదలైపోయింది. ఆగస్ట్ మూడో వారం నుంచి సెప్టెంబర్ రెండో వారం మధ్యలో మూడు క్రేజీ సినిమాలు థియేటర్స్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ రేసులో రెండు ప్యాన్ ఇండియన్ సినిమాలున్నాయి. మరి బరిలో దిగబోతున్న ఆ మూడు సినిమాలేంటి.. వాటిపై జరుగుతున్న బిజినెస్ ఎంత..? నాని నటిస్తున్న ది ప్యారడైజ్‌ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. రీసెంట్‌గా రిలీజైన ఆయా షేర్ పాటతో ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. ఈ క్రేజ్ చూస్తుంటే ప్యారడైజ్ కలెక్షన్స్ ఈజీగా 200 కోట్ల మార్క్‌ టచ్ అయ్యేలా కనిపిస్తుంది. ఆగస్ట్ 21న రాబోయే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే.. బాక్సాఫీస్ దగ్గర జడల్ బ్యాటింగ్ మామూలుగా ఉండదని అర్థమైపోతుంది. ప్యారడైజ్ వచ్చిన వారం రోజులకే ఆగస్ట్ 28న శర్వానంద్ భోగి ప్రేక్షకుల ముందుకు రానుంది. నారీనారీ నడుమ మురారి సినిమాతో హిట్ కొట్టిన శర్వా.. భోగితో ఆ దూకుడు కంటిన్యూ చేయాలని చూస్తున్నారు. ఏప్రిల్ 3న బైకర్ కూడా విడుదల కానుంది. అంటే జనవరి టూ ఆగస్ట్ మధ్యలో 3 సినిమాలు రెడీ చేసారు శర్వానంద్. సంపత్ నంది భోగి సినిమాను తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్ 11న కొత్తజంట విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న రణబాలి రానుంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాపైనే విజయ్ ఆశలన్నీ ఉన్నాయి. రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రణబాలిని నిర్మిస్తుంది. ఈ మూడు సినిమాలు హిట్టైతే టాలీవుడ్ సెకండాఫ్‌కు ఆరంభం అదిరిపోయినట్టే. చూడాలిక ఏం జరగబోతుందో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?

Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు

తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు

అనిల్‌ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *