అర్ధరాత్రి లాడ్జిలో మంటలు.. 33 మంది..

అర్ధరాత్రి లాడ్జిలో  మంటలు.. 33 మంది..


కడప జిల్లా రాజంపేటలో అర్థరాత్రి పెను ప్రమాదం తప్పింది. స్థానిక దీప్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పెను కలకలం రేగింది. ఈ ప్రమాద సమయంలో లాడ్జిలోని 22 గదుల్లో సుమారు 33 మంది ప్రయాణికులు నిద్రిస్తుండటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అర్థరాత్రి సమయంలో లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాదాపు లాడ్జిలోని 22 గదులకు ఈ మంటలు అంటుకుని దట్టమైన పొగ కమ్మేసింది. అప్రమత్తమైన లాడ్జి సిబ్బంది వెంటనే ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయడంతో 32 మంది సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక విచారణ ప్రకారం, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు నిర్ధారించారు. అయితే పూర్తిస్థాయిలో అసలు ఈ సంఘటన ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే దానిపై లాడ్జిలో ఉన్న వారిని విచారిస్తున్నారు. భారీ ప్రాణనష్టమైతే తప్పింది. నాణ్యత లేని వైరింగ్, భద్రతా ప్రమాణాల లోపం ఇలాంటి ఘటనలకు దారితీస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, లాడ్జీల వంటి జనం రద్దీగా ఉండే ప్రదేశాలలో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించడం అత్యంత అవసరం. లేని పక్షంలో ఇలాంటి చిన్న పొరపాట్లు భారీ ప్రాణ నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. కాగా ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

గుర్రంపై బ్లింకిట్ డెలివరీ.. ఇదెక్కడి మాస్ రా మావా..

EPFO: వాడని పీఎఫ్‌ ఖాతాల్లోని డబ్బులు వాపస్‌

వీడు కన్నేసాడంటే.. గురి తప్పడు.. చిటికెలో పగలకొట్టేస్తాడు

ఫేస్ చూసి అమాయకుడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే..

Ram Charan: మాలతో చరణ్‌ పార్టీకి వెళ్లడంపై వివాదం !! శిరీష్‌ క్లారిటీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *