Vijay Rashmika Wedding: అమ్మాయి హార్ట్ బ్రేక్.. విజయ్ పెళ్లి అయిపోయిందని ఎమోషనల్ అయిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్..

Vijay Rashmika Wedding: అమ్మాయి హార్ట్ బ్రేక్.. విజయ్ పెళ్లి అయిపోయిందని ఎమోషనల్ అయిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్..


టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో గ్రాండ్ గా జరిగింది. వీరి పెళ్లికి ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి అనంతరం తన భర్త విజయ్ దేవరకొండ అంటూ అభిమానులకు పరిచయం చేసింది రష్మిక. అలాగే తన భార్య రష్మిక అంటూ పెళ్లి ఫోటోస్ షేర్ చేశారు విజయ్. దీంతో ఈ నూతన జంటకు నెటిజన్స్, అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు పెళ్లి అనంతరం ఉదయ్ పూర్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు విజయ్, రష్మిక. ఉదయ్ పూర్ ఎయిర్ పోర్టులో వీరిద్దరు కలిసి కనిపించిన వీడియోస్ వైరల్ అయ్యాయి.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

ఇదిలా ఉంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందని తెలిసిందే. అయితే ఇప్పుడు విజయ్ పెళ్లి కావడంతో ఓ లేడీ ఫ్యాన్ ఎమోషనల్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన దగ్గర దాచుకున్న విజయ్ ఫోటోస్, తన సినిమాల పేపర్ కటింగ్స్ అన్నీ చూస్తూ ఎమోషనల్ అయ్యింది. తాను ఎంతో ఇష్టపడిన హీరో పెళ్లి చేసుకోవడంతో భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్స్ విభిన్నంగా రియాక్ట్ అవుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే. ఇటీవలే కింగ్డమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన వచ్చింది. అలాగే ఇప్పుడిప్పుడే తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *