K Kavitha: లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. బీఆర్ఎస్, బీజేపీపై కవిత కీలక వ్యాఖ్యలు!

K Kavitha: లిక్కర్ కేసులో క్లీన్‌చీట్.. బీఆర్ఎస్, బీజేపీపై కవిత కీలక వ్యాఖ్యలు!


లిక్కర్ కేసులో కోర్టు తీర్పుపై గతంలో కేటీఆర్ చేసిన ట్వీట్‌ను మాజీ ఎమ్మెల్సీ కవిత తప్పుబట్టారు. బీఆర్‌ఎస్ ఓటమికి లిక్కర్ కేసు కారణమంటూ గతంతో కేటీఆర్ ట్వీట్ చేశారని.. ఇది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. పార్టీ ఓటమికి కారణం నేనా? నా మీద కేసు పెట్టింది పార్టీ కోసం కాదా? అని ప్రశ్నించారు. పార్టీ ఓటమిని తన మీదకు నెడితే ఊరుకునేది లేదన్నారు. బీఆర్‌ఎస్ ఓటమికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. తప్పుడు కేసు అని మొదటి నుంచీ చెప్తున్నా తనకు అండగా ఎందుకు నిలబడలేదని నిలదీశారు. కోర్టు తీర్పును అనుకూలంగా మార్చుకుని తప్పును తనపై నెడతారా? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా బీఆర్ఎస్, బీజేపీ పార్టీలపై ఆమె విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు ఒక్కటే అంటూ కవిత ఆరోపణ చేశారు. అబద్ధాలు చెప్పి తప్పించుకోలేరన్నారు. ఓడిపోతే ఒప్పుకునే ధైర్యం ఉండాలన్నారు. కేవలం తన వల్లే పార్టీ ఓడిందా.. పార్టీ అంత బలహీనంగా ఉందా? అని ప్రశ్నించారు. KTR ఏం మాట్లాడినా చెల్లుతుందని అనుకుంటున్నారని.. ఓటమిని తనపై రుద్దాలని చూస్తే ప్రజలు ఊరుకోరన్నారు. తప్పుచేయకపోయినా ఏడాదిగా మానసిక క్షోభ అనుభవించానని అన్నారు. రెండు నెలల్లో కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు ప్రకటించారు కవిత.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *