Patanjali for Ear Problems: చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుత చికిత్స.. నో సైడ్‌ ఎఫెక్ట్స్‌!

Patanjali for Ear Problems: చెవి సమస్యలకు పతంజలి ఆయుర్వేధంతో అద్భుత చికిత్స.. నో సైడ్‌ ఎఫెక్ట్స్‌!


ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో దాదాపు 5% మంది ఏదో ఒక రకమైన వినికిడి సమస్యతో బాధపడుతున్నారు. ఇందులో అధిక మంది అల్లోపతిని ఆశ్రయిస్తుంటారు. కానీ ఇప్పుడు ఆయుర్వేదంలోనూ చెవి సంబంధిత సమస్యలకు మెరుగైన పరిష్కాలు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఇయర్‌గ్రిట్ ఇయర్‌డ్రాప్స్, ఇయర్‌గ్రిట్ గోల్డ్ టాబ్లెట్‌లను అభివృద్ధి చేసింది. చెవి ఇన్ఫెక్షన్లు, అనేక ఇతర సమస్యలకు చికిత్స చేయడంలో ఈ రెండూ ప్రభావవంతంగా పని చేస్తాయని పతంజలి పరిశోధన పేర్కొంది. పతంజలి మందుల వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవని, చెవిలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాపై దాడి చేసి చంపుతాయని తెలిపింది. చెవి ఇన్ఫెక్షన్లతో సంబంధం ఉన్న కణాలలో వాపు కారకాలను తగ్గించే సంకేతాలు ఇయర్‌గ్రిట్ గోల్డ్ మాత్రల్లో ఉన్నట్లు పరిశోధన చూపించింది. అవి వాపును తగ్గించడంలో సహాయపడ్డాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించే లక్షణాల కూడా వీటిల్లో ఉన్నట్లు కొన్ని పరీక్షలు నిరూపించాయి. చెవి నొప్పి, ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడంలో పతంజలి ఇయర్‌ డ్రాప్స్, మాత్రలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది.

ఆయుర్వేద మూలికలతో తయారు చేసిన ఇయర్‌గ్రిట్ ఇయర్‌డ్రాప్స్

పతంజలి ప్రకారం.. ఇయర్‌గ్రిట్ ఇయర్‌డ్రాప్స్‌ను మెంతులు, వేప, ధాతుర, తులసి, భ్రింగ్‌రాజ్, పసుపు, ఇతర ఔషధ పదార్థాలతో తయారు చేస్తారు. దీని ప్రత్యేక లక్షణం ఏమిటంటే.. ఇందులో నూనెకు బదులుగా గ్లిజరిన్‌ను ఉపయోగిస్తారు. దీంతో చలిలో గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. ఇయర్‌గ్రిట్ గోల్డ్ టాబ్లెట్లలో గిలోయ్, ఆమ్లా, లవంగం, అర్జునులు ఉంటాయి. వీటిని పూర్తిగా ఆయుర్వేద పద్ధతులను ఉపయోగించి తయారు చేశారు.

ప్రపంచ వ్యాప్తంగా పెరగనున్న వినికిడి లోపం

ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. 2050 నాటికి ప్రతి 10 మందిలో ఒకరు చెవి సమస్యలతో బాధపడే అవకాశం ఉంది. ఆందోళనకరమైన విషయం ఏమిటంటే చెవి సమస్యలను చాలా మంది తేలికగా తీసుకుంటూ ఉంటారు. సమస్య తీవ్రమయ్యే వరకు వారు చికిత్స తీసుకోరు. దీంతో వినికిడి సామర్థ్యం క్షీణించడం ప్రారంభిస్తున్నప్పుడు ఆసుపత్రికి వెళ్తారు.

ఇవి కూడా చదవండి

చెవి నిర్మాణం ఎలా ఉంటుందంటే?

  • బాహ్య చెవి- ఇది బయటి నుండి కనిపించే చెవి భాగం.
  • మధ్య చెవి- ఇది శరీరంలోని మూడు చిన్న ఎముకలను కలిగి ఉన్న ఒక చిన్న కుహరం. ఈ భాగం యుస్టాచియన్ ట్యూబ్ ద్వారా గొంతుకు అనుసంధానించబడి ఉంటుంది.
  • లోపలి చెవి- ఈ భాగంలో కోక్లియా అనే నత్త లాంటి నిర్మాణం ఉంటుంది. ఇక్కడ ఉండే ద్రవం ధ్వని తరంగాలను విద్యుత్ సంకేతాలుగా మార్చి మెదడుకు ప్రసారం చేస్తుంది.

ఈ మూడు భాగాలలో ఏదైనా ఇన్ఫెక్షన్ బారిన పడితే లేదా వాపు వస్తే, వినికిడి సామర్థ్యం దెబ్బతింటుంది.

వినికిడి సమస్య ఉంటే ఏమి చేయాలి?

ఒక వ్యక్తికి వినికిడి సమస్య ఉంటే సాధారణంగా వైద్యులు ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ పరీక్షను సిఫార్సు చేస్తారు. ఈ పరీక్ష ధ్వనిని డెసిబెల్స్‌లో కొలుస్తుంది. సాధారణంగా మనం 0 నుంచి 130 డెసిబెల్స్ మధ్య శబ్దాలను వినగలుగుతాం. కానీ 35 డెసిబెల్స్ కంటే ఎక్కువ శబ్ధం వినలేకపోతే వినికిడి లోపంగా పరిగణిస్తాం. ఇలంటి సందర్భాల్లో వైద్యులు వినికిడి యంత్రాన్ని సిఫార్సు చేస్తారు. లేదంటే శస్త్రచికిత్స లేదా ఇతర చికిత్సలు కూడా చేస్తారు.

చెవి వ్యాధి ఎందుకు వస్తుంది?

  • చెవి ఇన్ఫెక్షన్
  • ఇయర్‌ఫోన్‌ల అధిక వినియోగం
  • చెవిగులిమి
  • వృద్ధాప్యం
  • తల గాయం

ఎవరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి?

  • తరచుగా చెవి నొప్పి ఉన్నవారు
  • తలతిరుగుతున్న వారు
  • చాలా కాలంగా సైనస్ సమస్యలు ఉన్నవారు
  • రోజూ గంటలు తరబడి ఇయర్‌ఫోన్‌లు వాడేవారు

చెవి వ్యాధి ఎప్పుడు ప్రమాదకరం?

తీవ్రమైన చెవి నొప్పి ప్రమాదకరంగా మారవచ్చు. చెవి నుంచి రక్తం లేదా చీము స్రావం, నిరంతరాయంగా తీవ్రమయ్యే నొప్పి, అకస్మాత్తుగా వినికిడి లోపం వంటి లక్షణాలు తీవ్రమైన చెవిపోటు ఇన్ఫెక్షన్‌ను సూచిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ENT వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *