Telangana FSL Jobs 2026: సర్కార్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇదే

Telangana FSL Jobs 2026: సర్కార్ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఉద్యోగాలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. రాత పరీక్ష తేదీలు ఇదే


హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (టీజీఎఫ్ఎస్ఎల్)లో వివిధ పోస్టులకు సంబంధించి ఇటీవల రాత పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను తాజాగా టీజీపీఎస్సీ విడుదల చేసింది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాల నమోదు చేసి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ మేరక తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) ప్రకటన వెలువరించింది. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 93910 05006 నంబర్‌కు ఫోన్‌ చేయాలని సూచించింది.

 తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ ఉద్యోగాల అడ్మిట్ కార్డుల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కాగా షెడ్యూలు ప్రకారం ఈ రాత పరీక్షలు మార్చి 5, 6, 7 తేదీలలో హైదరాబాద్‌లోని మేడ్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో జరగనున్నాయి. ప్రతి టెక్నికల్ పేపర్ పరీక్షా సమయం ఒక గంట మాత్రమే ఉంటుందని, మధ్యలో అభ్యర్థులను బయటకు అనుమతించబోమని బోర్డు చైర్మన్ స్పష్టం చేశారు. పరీక్షా విధానం పూర్తిగా వివరణాత్మక (డిస్క్రిప్టివ్) పద్ధతిలో ఉండి, మొత్తం 10 ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు సుమారు 100 పదాలలో సమాధానం ఇవ్వాల్సి ఉంది. అన్ని ప్రశ్నలకు సమాధానం రాయడం తప్పనిసరి. ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. ఒక్కో ప్రశ్నకు 10 మార్కులు కేటాయిస్తారు. ఆ మార్కులను నోటిఫికేషన్‌లో పేర్కొన్న వెయిటేజీ ప్రకారం తుది మెరిట్ లెక్కింపునకు పరిగణనలోకి తీసుకుంటారు.

ఇవి కూడా చదవండి

తెలంగాణ అసిస్టెంట్‌ ప్రొఫెసర్స్‌ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో 607 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు తాజాగా ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలుంటే ఫిబ్రవరి 28వ తేదీలోగా తెలియజేయాలని అభ్యర్ధులకు సూచించింది.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *