JEE Main 2026: ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్‌ 2 దరఖాస్తు ప్రక్రియ.. మరికాసేపట్లో కరెక్షన్ విండో ఓపెన్

JEE Main 2026: ముగిసిన జేఈఈ మెయిన్ సెషన్‌ 2 దరఖాస్తు ప్రక్రియ.. మరికాసేపట్లో కరెక్షన్ విండో ఓపెన్


హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. ఫిబ్రవరి 26 (గురువారం) రాత్రి 11.50 గంటలకు దరఖాస్తు గడువు ముగిసింది. ఇక ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌లలో ఏవైనా పొరపాట్లు చేసి ఉంటే.. వీటిని సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ‘కరెక్షన్ విండో’ ఫిబ్రవరి 27న ప్రారంభించనుంది. అభ్యర్థులు శుక్రవారం నుంచి శనివారం (ఫిబ్రవరి 28) రాత్రి 11:50 గంటల వరకు తమ వివరాలను సవరించుకోవచ్చు.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 అప్లికేషన్‌ సవరన కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

అయితే జేఈఈ మెయిన్ సెషన్ 1కు రిజిస్టర్ చేసుకుని, రెండోసారి సెషన్ 2కు దరఖాస్తు చేసిన వారు కూడా సవరణ చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు తమ అప్లికేషన్‌లో కోర్సు పేపర్, మీడియం, స్టేట్ కోడ్, ఎగ్జామ్ సిటీ ఎంపిక, విద్యార్హతలు, జెండర్, కేటగిరీ వంటి వివరాలను మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. వీరితోపాటు తొలిసారి జేఈఈ మెయిన్‌ సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త అభ్యర్ధులు తమ పేరు, తల్లిదండ్రుల పేర్లు, విద్యార్హతలు, పుట్టిన తేదీ, కేటగిరీ వంటి అంశాలను సైతం సవరించుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే మొబైల్ నంబర్, ఈమెయిల్, అడ్రస్, ఫొటోలను మాత్రం ఎవరూ మార్చడానికి వీలుండదు. సవరణలు చేసే సమయంలో అభ్యర్థులు తప్పనిసరిగా Correction Fee చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి అభ్యర్ధికి కేవలం ఒక్కసారి మాత్రమే దరఖాస్తులో సవరణ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. కాబట్టి అభ్యర్ధులు జాగ్రత్తగా తమ వివరాలు సరిచేసుకోవల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

గడువు ముగిసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్ధులు తమ వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉండదు. కాగా జేఈఈ మెయిన్‌ 2026 సెషన్‌ 1కు దేశ వ్యాప్తంగా మొత్తం 13.5 లక్షల మంది హాజరయ్యారు. ఇక సెషన్‌ 2 రాత పరీక్షలు ఏప్రిల్‌ 2 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్‌ స్లిప్‌లను, 4 రోజుల ముందు అడ్మిట్ కార్డులను ఎన్టీయే విడుదల చేస్తుంది.

జేఈఈ మెయిన్ 2026 సెషన్ 2 అప్లికేషన్‌ సవరన కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *