ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపిన జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వివాదంలో మరొక వీడియో బయటపడింది. ఎమ్మెల్యే శ్రీధర్‌తో తన వాట్సాప్ చాటింగ్‌కు సంబంధించిన వీడియోలను వీణ విడుదల చేశారు. గత కొంతకాలంగా మౌనంగా ఉన్న ఆమె, ఇప్పుడు మరిన్ని వీడియోలను విడుదల చేయడంతో ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. వాట్సాప్ చాటింగ్‌తో పాటు, తనకు న్యాయం జరగడం లేదంటూ కన్నీటి పర్యంతమవుతూ మరో వీడియోను కూడా వీణ విడుదల చేశారు. ఈ అంశం బయటకు వచ్చి నెలలు గడుస్తున్నా తనకు న్యాయం జరగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కమిటీ పేరిట కాలయాపన జరుగుతోందని, పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందని వీణ అన్నారు. మహిళలకు పవన్ కల్పించే భద్రత ఇదేనా అని ప్రశ్నిస్తూ, న్యాయం జరగకపోతే ఆత్మహత్యే గతి అని ఆమె హెచ్చరించారు. తప్పు చేసిన వారిని పక్కన పెట్టుకుని తిరుగుతారా అని పవన్ కళ్యాణ్ ను ఆమె సూటిగా ప్రశ్నించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: ఎన్టీఆర్ సినిమాలో అతిథిగా ఆ స్టార్ హీరో.. బాబోయ్.. ఇక రచ్చ.. రోబోల..
Tollywood News: ఈటీ ఎక్స్‌క్లూజివ్.. మరిన్ని అప్డేట్స్
ఈ సమ్మర్.. పాపం ఆ హీరోయిన్లకు పెద్ద పరీక్షే
కుమ్మేస్తున్న కుర్రాళ్లు.. ఒక్కరు కూడా తగ్గట్లేదు
Nani: నాని డబుల్ బ్లాస్ట్.. ఈసారి మామూలుగా ఉండదు