Driving Licence: కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్.. ఆ పాయింట్లు తగ్గితే పూర్తిగా లైసెన్స్ క్యాన్సిల్.. కేంద్రం కొత్త రూల్స్

Driving Licence: కొత్త డ్రైవింగ్ లైసెన్స్‌ రూల్స్.. ఆ పాయింట్లు తగ్గితే పూర్తిగా లైసెన్స్ క్యాన్సిల్.. కేంద్రం కొత్త రూల్స్


వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలో బిగ్ షాకివ్వనుంది. త్వరలోనే కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు కఠిన నిబంధనలను అమలు చేసేందుకు రంగం సిద్దమవుతోంది. ఇక నుంచి ట్రాఫిక్ నిబంధనలకు పాల్పడేవారికి గ్రేడింగ్ పాయింట్ల విధానం అమలు చేయనుంది. అంటే మీరు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినప్పుడల్లా పాయింట్లను తగ్గించేస్తూ ఉంటారు. చివరికి అన్నీ పాయింట్లు తగ్గిపోయిన తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్ ఆరు నెలల పాటు నిషేధించడం లేదా పూర్తిగా రద్దు చేయడం లాంటివి చేస్తారు. గురువారం జరిగిన సీఐఐ క్లాన్‌కేవ్ సమావేశంలో కేంద్ర రోడ్డు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ గ్రేడింగ్ పాయింట్ల విధానం గురించి వివరాలు వెల్లడించారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

డ్రైవింగ్ లైసెన్స్ రద్దు

త్వరలో దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ పూర్తిగా మారనున్నాయి. ట్రాఫిక్ నిబంధనలు ప్రజలందరూ పాటించడంతో పాటు రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కఠిన రూల్స్ కేంద్రం ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్‌కు గ్రేడ్ పాయింట్ల విధానాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ఎలా పనిచేస్తుందంటే.. ప్రతీ డ్రైవింగ్ లైసెన్స్‌కు పాయింట్లు కేటాయిస్తారు. మీరు ఏదైనా ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినప్పుడల్లా పాయింట్లు తగ్గుతూ వస్తాయి. ఇలా ట్రాఫిక్ ఉల్లంఘనలు ఎక్కువై పాయింట్లు అన్నీ కోల్పోయినప్పుడు అధికారులు చివరికి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేస్తారు. ఈ విధానాన్ని త్వరలోనే అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలకు భయం, గౌరవం ఉండటం లేదని, అందువల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.

త్వరలోనే కొత్త రూల్స్

గ్రేడ్ పాయింట్లు అన్నీ కోల్పోయిన తర్వాత ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్‌పై నిషేధం విధిస్తారు. అలాగే పూర్తిగా రద్దు చేసే అవకాశం కూడా ఉంటుంది. త్వరలోనే ఈ రూల్స్‌ను అమలు చేస్తామని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇక దేశంలో ప్రతీ ఏడాది 1.8 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని, భారతదేశంలో ఎక్కువ మరణాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడటం ప్రభుత్వ విధి అని, అందుకే నివారణకు అనేక చర్యలు తీసుకుంటామన్నారు. రాంగ్ సైడ్ డ్రైవ్, డ్రంకెన్ డ్రైవ్, హైస్పీడ్, మొబైల్ మాట్లాడుతూ డ్రైవ్ చేయడం వంటి కారణాలతో ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు. అందుకే అలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేలా నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *