కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ తన తదుపరి చిత్రంతో అభిమానులను గందరగోళానికి గురిచేస్తున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో విజయం అందుకున్న అజిత్, తన నెక్స్ట్ మూవీ ప్లాన్స్ విషయంలో అస్పష్టమైన వార్తలతో చర్చకు దారితీశారు. తొలుత ఒక యువ దర్శకుడితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన అజిత్, ఆ తర్వాత తన నిర్ణయం మార్చుకున్నారని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రీకరణ సమయంలో అజిత్ ఏడాది బ్రేక్ తీసుకుంటారని, రేసింగ్‌పై దృష్టి సారిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఆయన మనసు మార్చుకుని రేసింగ్‌తో పాటు సమాంతరంగా సినిమాలు కూడా చేయాలని నిర్ణయించుకున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ దర్శకుడు అధిక్ రవిచంద్రన్‌తోనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: బాడీ షేమింగ్ చేశారంటూ బ్యూటీ ఆవేదన
Puri Jagannadh: బాలయ్యను డిఫరెంట్‌గా చూపించిన పూరి జగన్నాథ్
Punarvika: పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా పునర్జన్మ
గురుకులంలో క్షుద్రపూజలు.. రోడ్డెక్కిన విద్యార్థినులు..
Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే