WI vs SA: విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా

WI  vs SA: విండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా.. సేఫ్ జోన్‌లో టీమిండియా


West Indies vs South Africa, 47th Match, Super 8 Group 1: టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఏడో సూపర్ 8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్ల తేడాతో వెస్టిండీస్ జట్టును చిత్తు చేసింది. దీంతో సౌతాఫ్రికా జట్టు సెమీస్‌కు క్వాలిఫై అయింది. వెస్టిండీస్ నిర్ధేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో కేవలం 1 వికెట్ కోల్పోయి ఛేదించింది.

T20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో సూపర్ 8 మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా జట్టు, టీమిండియాకు సెమీస్ ఆశలను పెంచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది.

వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 177 పరుగుల లక్ష్యాన్ని చేరుకుంది. కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్ అజేయంగా 82 పరుగులు, ర్యాన్ రికెల్టన్ 45 పరుగులు చేశారు.

వెస్టిండీస్ తరఫున రొమారియో షెపర్డ్ అజేయంగా 52 పరుగులు చేయగా, జాసన్ హోల్డర్ 49 పరుగులకు అవుటయ్యాడు. దక్షిణాఫ్రికా తరఫున లుంగి ఎన్గిడి మూడు వికెట్లు పడగొట్టాడు. కగిసో రబాడ, కార్బిన్ బాష్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *