PM Modi Israel Visit : భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Israel Visit : భారత్‌-ఇజ్రాయెల్‌ మధ్య కీలక ఒప్పందాలు.. పూర్తి వివరాలు ఇవే!


రెండో రోజు ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రతినిధి బృంద స్థాయి చర్చలకు ముందు, ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చల కోసం ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో సమావేశమయ్యారు. కీలక రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడం, రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ఇక ప్రతినిధి స్థాయి బృంద చర్చల తర్వాత కీలక ఒప్పందాలపై రెండు దేశాల నేతలు సంతకాలు చేశారు.

ఇజ్రాయెల్‌తో భారత్‌ పలు కీలక ఒప్పందాలు

ఇజ్రాయెల్‌ ప్రధానితో సమావేశం సదర్భంగా ప్రధాని మోదీ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రక్షణ, వ్యాపార, వాణిజ్య రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగినట్టు తెలుస్తోంది. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇజ్రాయెల్‌లో యూపీఐ వాడకంపై ఒప్పందం జరిగినట్టు తెలుస్తోంది. అలాగే ఉగ్రవాదంపై ఉమ్మడి పోరాటం చేయాలని నిర్ణయించారు. ఏఐతో పాటు వ్యవసాయరంగంలో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
త్వరలో రెండు దేశాల మధ్య ట్రేడ్‌ డీల్‌పై నిర్ణయం తీసుకున్నారు. అలాగే 27 రంగాల్లో భారత్‌-ఇజ్రాయెల్‌ పరస్పర సహకారం ఉండాలని నిర్ణయించారు. భారత్‌-ఇజ్రాయెల్‌ ఎకనామిక్‌ ఫోరం ఏర్పాటు, అణు ఇంధన రంగంలో రెండుదేశాల మధ్య సహకారం, ఇరుదేశాల మధ్య 100 ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు ఏర్పాట్లపై ఒప్పందం కుదుర్చుకున్నారు.

భారత్‌కు ఆహ్వానం

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇజ్రాయెల్‌లో నాకు, నా ప్రతినిధి బృందానికి లభించిన గౌరవం మన ప్రజల మధ్య ఉన్న లోతైన బంధాన్ని ప్రతిబింబిస్తుందని అన్నారు. సైన్స్, ఆవిష్కరణ, విద్య, నీటి నిర్వహణ, వ్యవసాయం అంతటా బలమైన భారతదేశం-ఇజ్రాయెల్ సంబంధాలు ప్రపంచ వృద్ధికి తొల్పడుతాయన్నారు. భారత్‌ ఎప్పికప్పుడూ అద్భుతమైన ఫలితాలతో ఇజ్రాయెల్ ఉత్తమ పద్ధతులను అవలంబిస్తూనే ఉందని.. కేవలం ఢిల్లీ మాత్రమే కాకుండా దేశంలోని ఇతర ప్రాంతాలను కూడా సందర్శించాలని ఇజ్రాయెల్ అధ్యక్షుడు హెర్జోగ్‌ను ప్రధాని మోదీ ఆహ్వానించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *