ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు

ఏజెన్సీలో చీకటి వైద్యం.. సెల్‌ఫోన్‌ వెలుగుల్లో ప్రజల ప్రాణాలు


సాంకేతిక యుగంలో చంద్రమండలానికి వెళ్తున్నామని చెప్పుకుంటున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం ఇంకా చీకట్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో నెలకొన్న దుస్థితి ప్రభుత్వ వైద్య సేవలకు అద్దం పడుతోంది. విద్యుత్ సరఫరా లేక, కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకపోవడంతో వైద్యులు మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్ల వెలుతురులో రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు ప్రజలను విస్మయానికి గురిచేస్తున్నాయి. అత్యవసర చికిత్సలు, చిన్న పిల్లల గదుల్లో కూడా కనీసం ఛార్జింగ్ లైట్లు లేకపోవడంతో రోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. గాయాలైన వారికి కుట్లు వేయడం, ఇంజెక్షన్లు ఇవ్వడం వంటి పనులను వైద్యులు సెల్ ఫోన్ టార్చ్ వెలుతురులోనే చేయాల్సి వస్తోంది. ఏ మాత్రం అటు ఇటు అయినా రోగుల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యులు తమ నిబద్ధతతో ఉన్నంతలో సేవలు అందిస్తున్నప్పటికీ, కనీస మౌలిక సదుపాయాలైన ఇన్వర్టర్లు లేదా జనరేటర్లు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం. చంటి పిల్లలు, గర్భిణీలు ఉండే ఆసుపత్రుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం గమనార్హం. చీకట్లో వైద్యం చేయడం అంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అని ఏజెన్సీ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి, ఏజెన్సీ ప్రాంతంలోని ఆసుపత్రులకు నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని, అవసరమైన చోట సోలార్ లేదా పవర్ బ్యాకప్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దారుణం.. 2 నెలల పసికందును పొయ్యిలో పడేసి..

Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. పెళ్లి చీర ఎలా కట్టుకుంటారంటే

Vijay-Rashmika Marriage: కొడవ సంప్రదాయంలో.. వరుడు ఎలాంటి దుస్తులను ధరించాలంటే

Vijay-Rashmika Marriage: ‘విరోషి’ పెళ్లిలో.. ఘుమ ఘుమలాడే వంటకాలు

Anvesh: ‘నా అన్వేష్‌కు లుక్‌ అవుట్ నోటీసులు’ నోరు అదుపులో లేకపోతే ఇంతే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *