20 ఏళ్ల స్నేహానికి గుర్తుగా.. అరుదైన పుష్పానికి మోదీ పేరు.. దీని గురించి మీకు తెలుసా?

20 ఏళ్ల స్నేహానికి గుర్తుగా..  అరుదైన పుష్పానికి మోదీ పేరు.. దీని గురించి  మీకు తెలుసా?


భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఇజ్రాయెల్‌లోని ఓ ప్లవర్‌ గార్డెన్‌లో కొత్తగా అభివృద్ది చేసిన వేగంగా పెరిగే తెల్లని క్రిసాన్తిమం అనే పుష్పానికి ప్రధాని గౌరవార్థం “మోదీ” అని నామకరణం చేశారు. 2017లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్‌కు వెళ్లిన మొదటి ద్వైపాక్షిక సందర్శన సందర్భంగా జరిగిన ప్రత్యేక సంజ్ఞగా పరిగణించబడింది. ప్రధాని మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ఎయిర్‌ పోర్టు నుంచి జెరూసలేంకు వెళ్లే మార్గంలో ఈ ఫ్లవర్ ఫార్మ్‌ను సందర్శించారు.

ఈ సందర్భంగా ఆ ఫామ్‌లో కొత్తగా అభివృద్ధి చేసిన క్రిసాన్తిమమ్ అనే పుష్పానికి ప్రధాని గౌరవార్థం మోదీ అనే నామకరణం చేశారు. అనంతరం ఆయనకు పుష్పం మొదటి గుత్తిని అందజేశారు. ఇది ఇరు దేశాల మధ్య స్నేహం, వ్యవసాయ సహకారానికి చిహ్నంగా నిలిచింది.

ఇక తాజాగా ప్రధాని మోదీ మరోసారి ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. రెండో రోజు పర్యటనలో భాగంగా ఆయన బిజీబిజీగా గడుపుతున్నారు. జెరూసలెంలో హోలోకాస్ట్‌ మెమోరియల్‌ను సందర్శించారు మోదీ. నాజీల నరమేథంలో బలైన యూదులకు ఘననివాళి అర్పించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమిన్‌ నెతన్యాహూతో కీలక చర్చలు జరుపుతున్నారు మోదీ. కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేయబోతున్నాయి.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *