మీన రాశి..
మీన రాశిని పాలించే గ్రహం గురుడు (బృహస్పతి). గురుగ్రహం జ్ఞానం, శ్రేయస్సుకు కారకుడు. మీన రాశి వారు ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. ఏ పని చేసినా అంకితభావంతో, విశ్వాసంతో చేస్తారు. ఈ గుణం లక్ష్మీదేవిని ప్రసన్నం చేస్తుందని నమ్మకం. కొన్నిసార్లు పూర్వీకుల ఆస్తి లేదా ఊహించని ఆర్థిక లాభాలు పొందే అవకాశమూ ఉంటుంది. వీరి జీవితం శాంతి, ఆనందం, ఆర్థిక భద్రతతో నిండివుంటుంది. అయితే, ఇవి జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడిన విషయాలు మాత్రమే. వ్యక్తిగత కృషి, పట్టుదల, సత్ప్రవర్తనలే నిజమైన విజయానికి ఆధారం.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)