Arjun Tendulkar Wedding : కొడుకు పెళ్లిలో సచిన్ ఎమోషనల్.. అర్జున్-సానియా వెడ్డింగ్ కి అంతా రెడీ

Arjun Tendulkar Wedding : కొడుకు పెళ్లిలో సచిన్ ఎమోషనల్.. అర్జున్-సానియా వెడ్డింగ్ కి అంతా రెడీ


Arjun Tendulkar Wedding : క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిరకాల స్నేహితురాలు సానియా చందోక్‌తో అర్జున్ వివాహం మార్చి 5వ తేదీన ముంబైలో అట్టహాసంగా జరగనుంది. ఈ వేడుకకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ, నీతా అంబానీ దంపతులు జామ్‌నగర్‌లో గ్రాండ్ గా ప్రీ-వెడ్డింగ్ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో తన కుమారుడి పెళ్లి గురించి సచిన్ చేసిన ఎమోషనల్ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కొడుకు ఎదుగుదల గురించి సచిన్ మాట్లాడుతూ.. “ఒక కొడుకు తను ప్రేమించిన అమ్మాయిని ఇంటికి తీసుకువచ్చి పరిచయం చేసినప్పుడే, ఆ తండ్రికి తన కొడుకు పెద్దవాడయ్యాడని అర్థమవుతుంది. అర్జున్, సానియా ఒకరినొకరు పిచ్చిగా ప్రేమించుకుంటున్నారు. అర్జున్ తనకు నచ్చిన, తనను అంతే ప్రేమించే తోడును వెతుక్కున్నందుకు ఒక తండ్రిగా నాకు చాలా గర్వంగా ఉంది” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో పంచుకుంది.

సచిన్ కాబోయే కోడలు సానియా చందోక్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడమే కాకుండా, వెటర్నరీ టెక్నీషియన్‌గా కూడా అర్హత సాధించారు. ప్రస్తుతం ఆమె ‘Mr. Paws Pet Spa, Store LLP’ అనే పెట్ వెల్‌నెస్ బ్రాండ్‌ను నడుపుతున్నారు. సానియా ప్రముఖ వ్యాపార దిగ్గజం రవి ఘాయ్ (గ్రావిస్ గ్రూప్ చైర్మన్) మనవరాలు. ఆమె తల్లిదండ్రులు సన్నీ, గౌరికా కూడా అదే సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్నారు.

ఇక అర్జున్-సానియా పెళ్లి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ జంట ఇప్పటికే దేశంలోని ప్రముఖులను కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలిసి పెళ్లికి ఆహ్వానించారు. ముంబైలో జరగబోయే ఈ పెళ్లి వేడుకకు క్రీడా, రాజకీయ, సినీ రంగాలకు చెందిన దిగ్గజాలు హాజరుకానున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *