Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 12 రాశుల వారికి రాశిఫలాలు


దిన ఫలాలు (ఫిబ్రవరి 26, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో గౌరవాభిమానాలకు లోటుండదు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి వారికి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. మిథున రాశి వారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో గౌరవాభిమానాలకు లోటుండదు. ప్రత్యేక బాధ్యతలను అప్పగించే అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాలు లాభాలు గడించడం జరుగుతుంది. ఆదాయ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందే అవకాశం ఉంది. ఆద్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఉండడం మంచిది కాదు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. వ్యాపారాలు యథావిధిగా కొనసాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, ముఖ్యమైన అవసరాలు తీరడమేకాక, ఆర్థిక సమస్యలు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలపై శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించిన శుభవార్త వింటారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండడం మంచిది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగా శుభ వార్తలు వినే అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. కొందరు మిత్రులకు అండగా నిలబడతారు. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ఆరోగ్యం పరవాలేదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఇతరులకు సాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి జీవితంలో బాగా డిమాండ్ పెరుగుతుంది. ముఖ్య మైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభ సమాచారం అందుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలలో తప్పకుండా అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. పిల్లల వల్ల సమస్యలు తలెత్తవచ్చు. ఆదాయంతో సమానంగా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. కుటుంబ పెద్దలలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు. చిన్ననాటి స్నేహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒకరిద్దరు బంధువులకు బాగా సహాయం చేయాల్సి వస్తుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కనిపిస్తుంది. అధికారుల నుంచి ఆదరణ పెరుగుతుంది. సలహాలు, సూచనలకు విలువ ఉంటుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదా వ్యాపారంలో పెట్టుబడులు పెంచడానికి ఆలోచించడం జరుగుతుంది. కుటుంబంలో సామరస్యం బాగా పెరుగుతుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి జీవితం మీద బాగా ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగం మారాలనుకునేవారికి, నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది కానీ, ఖర్చులు బాగా పెరగవచ్చు. ముఖ్యమైన పనులు, ప్రయత్నాలు కొంత వరకూ సంతృప్తి కరంగా పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల్లో ఒకరి నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రయాణాల్లో విలువైన వస్తువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ)

ఉద్యోగపరంగానే కాకుండా, కుటుంబపరంగా కూడా కొద్దిగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి తప్పకపోవచ్చు. అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. తొందరపాటు మాటలు రానివ్వవద్దు. ఉద్యోగం మారడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వినడం జరుగుతుంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి కానీ, కుటుంబ జీవితంలో కొద్దిగా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఆచితూచి వ్యవహరించడం, జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిత్రుల వల్ల కొద్దిగా డబ్బు నష్టపోయే సూచనలున్నాయి. బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. స్వయం ఉపాధి, వ్యాపారాలు బాగా పురోగమిస్తాయి. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అయ్యే అవకాశం ఉంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాల్లో కలిసి వస్తుంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ బాగా పెరుగుతుంది. ఆదాయంలో ఆశించిన పెరుగుదల ఉండవచ్చు. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. బకాయిలు, బాకీలు చేతికి అందుతాయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా అది విజయవంతం అవుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా ఉత్తమం.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సామరస్యంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా కొనసాగుతాయి. ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో ఒత్తిడికి గురవుతారు. శుభ పరిణామం ఒకటి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. పిల్లల్లో పురోగతి కనిపిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. శుభ కార్యాల మీద బాగా వ్యయం అవుతుంది. ఒకరిద్దరికి సహాయం చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. అదనపు బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఐ.టి నిపుణులకు ఉద్యోగం మారే అవకాశాలున్నాయి. పెళ్లి సంబంధం కుదరవచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే సూచనలున్నాయి. ఆదాయంలో మెరుగుదల కనిపిస్తోంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తకుండా జాగ్రత పడాల్సి ఉంటుంది. తోబుట్టువులతో సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *