దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు అరటిపండు తింటే ఏమవుతుంది..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే షాకే..

దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు అరటిపండు తింటే ఏమవుతుంది..? డాక్టర్లు చెప్పేది తెలిస్తే షాకే..


అరటిపండు.. సామాన్యుడి ఆపిల్. ఏడాది పొడవునా అతి తక్కువ ధరకు లభించే ఈ పండు శక్తికి నిలయం. అయితే జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు అరటిపండు తింటే సమస్య మరింత ముదురుతుందనే భయం చాలామందిలో ఉంది. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ దీపక్ సుమన్ ప్రకారం.. అరటిపండ్లు నేరుగా జలుబును కలిగించవు. ఇందులో విటమిన్ బి6, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తికి మేలు చేస్తాయి. అరటిపండు తినడం వల్ల జలుబు తీవ్రమవుతుందని నిరూపించడానికి వైద్య శాస్త్రంలో శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇప్పటికే జలుబు లేదా దగ్గుతో బాధపడుతున్నప్పుడు, కొంతమందిలో ఇది అసౌకర్యాన్ని పెంచవచ్చు.

ఆయుర్వేదం ఏమంటోంది?

ఢిల్లీ ప్రభుత్వ ఆయుర్వేద విభాగ నిపుణులు డాక్టర్ ఆర్.పి. పరాశర్ అభిప్రాయం ప్రకారం.. ఆయుర్వేదంలో అరటిపండు స్వభావాన్ని చలవ చేసేది గా పరిగణిస్తారు. ఇది శరీరంలో కఫాన్ని పెంచే అవకాశం ఉంది. అందుకే చలికాలంలో లేదా వర్షాకాలంలో జలుబు ఉన్నప్పుడు దీన్ని నివారించాలని ఆయుర్వేదం సూచిస్తుంది. సాధారణ ఆరోగ్యం ఉన్నవారికి ఇబ్బంది లేకపోయినా, జలుబు స్వభావం ఉన్నవారు రాత్రిపూట లేదా చలికాలంలో అరటిపండుకు దూరంగా ఉండటమే మంచిది.

అరటిపండు ఎవరెవరు తినకూడదు?

ఈ సమస్యలు ఉన్నవారు జలుబు ఉన్న సమయంలో అరటిపండుకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.

  • తరచుగా జలుబు, తుమ్ముల బారిన పడేవారు.
  • అలెర్జీల వల్ల ముక్కు కారే సమస్య ఉన్నవారు.
  • టాన్సిల్స్ లేదా గొంతు నొప్పి ఉన్నవారు.

అరటిపండుతో కలిగే అద్భుత ప్రయోజనాలు

జలుబు లేని సమయంలో అరటిపండు ఒక సూపర్‌ఫుడ్‌గా పనిచేస్తుంది.

ఇన్‌స్టంట్ ఎనర్జీ: వ్యాయామం చేసేవారికి, నీరసంగా ఉన్నవారికి తక్షణ శక్తిని ఇస్తుంది.

గుండె ఆరోగ్యం: ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ: ఫైబర్ అధికంగా ఉండటం వల్ల మలబద్ధకం సమస్యను నివారిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *