Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి ఎవరంటే?

Shanmukh Jaswanth: అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్.. ఫొటోస్ వైరల్.. అమ్మాయి ఎవరంటే?


కవర్ సాంగ్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య వెబ్ సిరీస్ లతో యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు షణ్ణూ. ఒకానొక దశలో తెలుగులో అత్యధిక సబ్ స్క్రయిబర్స్ కలిగిన యూట్యూబర్ గా గుర్తింపు పొందాడు. తన ఆట, మాట తీరుతో రన్నరప్ గా నిలిచాడు. అయితే ఈ బిగ్ బాస్ షో లో సిరి హన్మంతుతో షణ్ముఖ్ నడుచుకున్న తీరు చాలా మందికి నచ్చలేదు. అప్పటికే దీప్తి సునయనతో ప్రేమలో ఉన్న అతను సిరితో ప్రవర్తించిన తీరు ఆడియెన్స్ కు వెగటు పుట్టించింది. ఈ షో ముగిసిన కొన్ని రోజులకే దీప్తి కూడా షణ్ణూకు దూరమైంది. ఇద్దరూ బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.

దీప్తితో బ్రేకప్ తర్వాత మళ్లీ ప్రేమలో పడ్డాడు షణ్ముఖ్. కొన్ని రోజుల క్రితం ఫేస్ చూపించకుండా ఒక అమ్మాయిని పరిచయం చేసాడు షణ్ణూ. ఇప్పుడు ఏకంగా ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చాడు. బుధవారం (ఫిబ్రవరి 25) ప్రేయసి వైష్ణవి చోడిశెట్టి అనే అమ్మాయిని నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించి పలు ఫొటోలు షేర్ చేసాడు. దీంతో ఈ ఫొటోలు కొద్ది క్షణాల్లోనే వైరల్ గా మారాయి. పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు షణ్ముఖ్ జస్వంత్, వైష్ణవిలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా షణ్ణూకు కాబోయే భార్య వైష్ణవి పేరు తప్పితే ఇతర సమాచారం దొరకడం లేదు. కానీ నెటిజన్లు మాత్రం ఆమె గురించి ఆరా తీసే పనిలో పడ్డారు. మరి వీరి పరిచయం ఎప్పుడు, ఎక్కడ జరిగింది? ఎలా ప్రేమలో పడ్డారు? అని తెలుసుకోవాలంటే షణ్ముఖ్ నోరు విప్పాల్సిందే.

ఇవి కూడా చదవండి

షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ ఫొటోస్..

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు వివాదాల్లో చిక్కుకున్నాడు షణ్ముఖ్ జస్వంత్ . పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ పరంగా పలు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ బిజీ అవుతున్నాడు.

వైష్ణవితో షణ్ముఖ్ జస్వంత్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *