Auto Ram Prasad: డైరెక్టర్‌గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్

Auto Ram Prasad: డైరెక్టర్‌గా కొత్త జర్నీ.. మొదలు పెట్టిన ఆటో రాంప్రసాద్


జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో అవకాశాలు తెచ్చుకొని ఆర్థికంగా స్థిరపడుతూనే రాణిస్తున్నారు. హీరోలుగా, సహాయక నటులుగా, కమెడియన్లుగా, నిర్మాతలుగా, డైరెక్టర్లుగా.. ఇలా తమకు అచ్చొచ్చిన రంగాల్లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ ఆటో రాంప్రసాద్.. డైరెక్టర్ గా మారనున్నాడు. మెగా ఫోన్ పట్టి సినిమాలు తీసేందుకు రెడీ అయ్యాడు. గతంలో జబర్దస్త్ లో చేసిన వేణు, ధనరాజ్, అదిరే అభి డైరెక్టర్లుగా మారారు. తమ టేకింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు తన ఆటో పంచులతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించే ఆటో రామ్ ప్రసాద్… కూడా ఈ జాబితాలో చేరేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తోంది. మొదట్లో రచయితగానే రాంప్రసాద్.. జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత సుధీర్, గెటప్ శ్రీనుతో కలిసి స్కిట్స్ చూస్తూ.. ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ సినిమాల్లో బిజీగా మారినా కూడా.. తను మాత్రం జబర్దస్త్‌లోనే కంటిన్యూ అవుతూ.. స్కిట్స్‌ చేస్తూన్నాడు. ఇక మరోవైపు కమెడియన్ గా సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. ఈ క్రమంలోనే గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా గెటప్‌ శ్రీను రాంప్రసాద్ గురించి ఓ విషయం చెప్పాడు. ‘రామ్ ప్రసాద్ డైరెక్టర్ అవ్వాలి. త్వరలో కాబోతున్నాడు కూడా. ఆ పనులు కూడా జరుగుతున్నాయి’ అని అన్నాడు. దీంతో ఈ జబర్దస్త్ కమెడియన్ కూడా డైరెక్టర్ అవబోతున్నాడనే విషయం బయటికి వచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Yash: కటింగ్ చేసిన ‘సింహం’ మాదిరి.. KGF హీరో లుక్‌పై కామెడీ సెటైర్లు

‘కొడవ’ పద్దతిలో విజయ్, రష్మిక వివాహం.. ఈ పెళ్లి ప్రత్యేకలు ఏంటంటే ??

Babu Mohan: నేను తినే పాన్‏లో విషం పెట్టి చంపాలనుకున్నారు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *