50 బంతుల్లో పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులతో చెడుగుడు ఆడేశాడుగా

50 బంతుల్లో పాకిస్తాన్ ఇజ్జత్ పాయే.. కట్‌చేస్తే.. 3 భారీ రికార్డులతో చెడుగుడు ఆడేశాడుగా


Harry Brook century vs Pakistan: ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రుక్ టీ20 వరల్డ్ కప్ 2026లో చరిత్ర సృష్టించాడు. సెమీఫైనల్ టికెట్ ఖాయం అయ్యే కీలక మ్యాచ్‌ను ఎంచుకుని, పాకిస్తాన్‌పై అద్భుతమైన శతకం బాది 3 భారీ రికార్డులు నెలకొల్పాడు. కీలక మ్యాచ్ అంటే భారీ ఇన్నింగ్స్ ఆడే కెప్టెన్ ఎలా ఉండాలో హ్యారీ బ్రుక్ మరోసారి నిరూపించాడు.

పాకిస్తాన్‌పై విజయం ఇంగ్లాండ్‌కు సెమీఫైనల్ చేరడానికి అత్యంత కీలకం. ఆ అవసరాన్ని అర్థం చేసుకున్న హ్యారీ బ్రుక్, కష్టకాలంలో జట్టును ముందుకు నడిపించే కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. తన శతకంతో పాకిస్తాన్‌ను ఓడించడమే కాదు, ఇంగ్లాండ్‌ను సెమీఫైనల్‌కు చేర్చడమే కాకుండా మరో మూడు ఘనతలను కూడా సాధించాడు.

పాకిస్తాన్‌పై హ్యారీ బ్రుక్ శతకం..

హ్యారీ బ్రుక్ పాకిస్తాన్‌పై 51 బంతుల్లో 100 పరుగులు చేశాడు. 196.07 స్ట్రైక్‌రేట్‌తో ఆడిన ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇది హ్యారీ బ్రుక్ టీ20 అంతర్జాతీయ కెరీర్‌లో తొలి శతకం కావడం విశేషం.

ఇది కూడా చదవండి: IND vs ZIM: జింబాబ్వేతో కీలక మ్యాచ్.. ఏకంగా నలుగురికి హ్యాండిచ్చిన సూర్య.. ఎవరంటే?

హ్యారీ బ్రుక్ సాధించిన 3 రికార్డులు..

టీ20 వరల్డ్ కప్‌లో శతకం చేసిన తొలి కెప్టెన్

టీ20 వరల్డ్ కప్ చరిత్రలో శతకం చేసిన తొలి కెప్టెన్‌గా హ్యారీ బ్రుక్ రికార్డు సృష్టించాడు.

మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన ఇంగ్లాండ్ మూడో ఆటగాడు..

టెస్ట్, వన్డే, టీ20 – మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన ఇంగ్లాండ్ జట్టు మూడో ఆటగాడిగా బ్రుక్ గుర్తింపు పొందాడు.

టీ20 వరల్డ్ కప్‌లో రెండో వేగవంతమైన శతకానికి సమం..

బ్రుక్ శతకం 50 బంతుల్లో పూర్తయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకానికి సమం చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఇది కూడా చదవండి: IND vs SA: సూర్య, గంభీర్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయమే.. టీమిండియా ఓటమికి కారణం: అశ్విన్

కష్టసమయంలో కెప్టెన్ ఇన్నింగ్స్..

ఈ శతకం ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే అది పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కష్టసమయంలో వచ్చింది. ఇంగ్లాండ్ 58 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఒత్తిడిలో పడిన వేళ, బ్రుక్ ఒంటరిగా జట్టును ఆదుకున్నాడు. ముందుగా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఆ తర్వాత వేగం పెంచి మ్యాచ్‌ను పాకిస్తాన్ చేతుల్లో నుంచి లాగేసుకున్నాడు. అతని ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లాండ్ సెమీఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *