ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు

ముస్లింల కోసం కదిలివచ్చిన హిందూ కుటుంబం.. వాళ్లు చేసిన పని ఏంటో తెలిస్తే మెచ్చుకోకుండా ఉండలేరు


భారతదేశం సర్వమత సౌభ్రాతృత్వానికి ప్రతీక చిన్నప్పుడు పుస్తకాల్లో చదివాం.. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింల కోసం ఓ హిందూ కుటుంబం కదిలి వచ్చింది. తమకు కులమత భేదాలు, జాతి తేడాలు లేవని నిరూపించింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

హైదరాబాద్ మహా నగరంలోని గుడిమల్కాపూర్ ప్రాంతానికి చెందిన దయానంద్ హిందూ మతానికి చెందిన వ్యక్తి. అతడు తన కుటుంబ సభ్యులతో కలిసి చేసిన గొప్ప పనిని ఇప్పుడు అందరూ మెచ్చుకుంటున్నారు. ఇంతకీ వాళ్లేం చేశారో తెలుసా?.. రంజాన్ మాసంలో ఉపవాసాల్లో ఉన్న ముస్లింల కోసం పండ్లు తీసుకుని మసీదుకు వెళ్లారు. సూర్యుడు అస్తమించే సమయంలో ఉపవాస దీక్ష విరమించే సమయానికి ముందు ఆ కుటుంబం పెద్దమొత్తంలో పండ్లు ఇవ్వడానికి రావడం చూసి మసీదులో అందరూ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలు ఆ పండ్లను ప్రేమగా స్వీకరించారు. పండ్లను తీసుకొచ్చిన దయానంద్ కుటుంబం కూడా ముస్లిలు మసీదులో ఏ విధంగా ప్రార్ధనలు నిర్వహిస్తారో, వాళ్ల పద్దతులు ఎలా ఉంటాయనేది చాలా ఆసక్తిగా తిలకించారు. దయానంద్ కుటుంబం చూపించిన ఆదరణ, ప్రేమతో పాటుగా  మసీదులో మహిళలు కూడా ఎంతో భక్తిశ్రద్ధలతో తలపై చీర కొంగు వేసుకుని రావడం పలువురిని ఆకర్షించింది.

హైదరాబాద్ మహా నగరం కులమతాలకి అతీతంగా గంగా జమున తహసీబ్ అనే మాటలకు ఈ సంఘటన కళ్లకు కట్టినట్లుగా చూపించింది. దయానంద్ కుటుంబం చేసిన ఈ గొప్ప పనికి తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ.. సామరస్యంగా మెలుగుతున్న ఇలాంటివారు ఎంతో మందికి ఆదర్శమని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *