Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. తేల్చేసిన హరీష్ శంకర్..!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. తేల్చేసిన హరీష్ శంకర్..!


Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్‌లో అవేం ఉండవు.. తేల్చేసిన హరీష్ శంకర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఆరా ఆఫ్ ఉస్తాద్’ పాటకు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చూసి… పవన్ కళ్యాణ్ ప్రస్తుత రాజకీయ ఇమేజ్‌కు తగ్గట్టుగా సినిమాలో పవర్ ఫుల్ పొలిటికల్ సెటైర్లు, డైలాగులు ఉంటాయని అభిమానులు లెక్కలేసుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. సినిమాలో ఎలాంటి రాజకీయ అంశాలు, సెటైర్లు, రెఫరెన్సులు ఉండవని దర్శకుడు హరీష్ శంకర్ తాజాగా తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ, ఈ సినిమా పూర్తిగా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా మాత్రమే ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టం చేశారు.

సినిమాలో పాలిటిక్స్‌కు సంబంధించినవి ఏమీ ఉండవని ముందుగానే దర్శకుడు ప్రకటించడం వెనక ఒక స్పష్టమైన వ్యూహం, ఓ బలమైన కారణం ఉంది. సినిమాను రాజకీయాలతో ముడిపెట్టవద్దని, ఎవరినీ ఉద్దేశించి వ్యక్తిగతంగా లేదా ఏ రాజకీయ పార్టీని టార్గెట్ చేస్తూ డైలాగులు ఉండకూడదని పవన్ కళ్యాణ్ మొదటి రోజే హరీష్ శంకర్‌కు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. రాజకీయంగా సైద్ధాంతిక విభేదాలు ఉన్నప్పటికీ ప్రకాష్ రాజ్ లాంటి నటులతో పవన్ ఈ సినిమాలో కలిసి పనిచేయడమే ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనం. అభిమానులు కేవలం పొలిటికల్ పంచ్‌ల కోసమే థియేటర్లకు వచ్చి నిరాశ చెందకూడదనే ఉద్దేశ్యంతోనే.. అంచనాలను బ్యాలెన్స్ చేయడానికి, అలాగే విడుదలకు ముందు అనవసర వివాదాలకు తావివ్వకుండా ఉండటానికి హరీష్ శంకర్ ఈ విషయాన్ని ముందుగానే క్లారిటీ ఇచ్చారు.

అంతా బాగానే ఉన్నా.. పొలిటికల్ రిఫరెన్స్‌లు లేకపోతే రాజకీయంగా పవన్ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ చూపుతుంది? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది. వాస్తవానికి ఒక వర్గాన్ని టార్గెట్ చేసే డైలాగ్స్ లేకపోవడం వల్ల సినిమా రీచ్ మరింత పెరుగుతుంది. పవన్ కళ్యాణ్‌కు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లోనూ, వర్గాల్లోనూ అభిమానులు ఉన్నారు. సినిమాను పూర్తిగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంచడం వల్ల, సగటు ప్రేక్షకుడు ఎలాంటి పక్షపాతం లేకుండా స్వచ్ఛమైన సినిమాను ఎంజాయ్ చేయగలుగుతారు. పవన్ కళ్యాణ్ మాస్ అప్పీల్‌ను, ఆయన ఆరాను ఇది మరింత పెంచుతుంది. పొలిటికల్ అంశాలు, సెటైర్లు లేకుండా ఉస్తాద్ నిలబడతాడా? అంటే కచ్చితంగా నిలబడతాడనే సమాధానమే వినిపిస్తోంది. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఇండస్ట్రీ హిట్ గబ్బర్ సింగ్ కేవలం వినోదం, పవన్ కళ్యాణ్ స్వాగ్, మేనరిజమ్స్ పైనే ఆధారపడి సంచలనం సృష్టించింది.

ఉస్తాద్ భగత్ సింగ్‌లో కూడా పొలిటికల్ పంచ్‌లు లేకపోయినా.. పవన్ మార్క్ కామెడీ, హై-వోల్టేజ్ యాక్షన్, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్, అన్నింటికీ మించి ఫ్యాన్స్‌కి కావాల్సిన హీరో ఎలివేషన్స్ పుష్కలంగా ఉంటాయని డైరెక్టర్ హామీ ఇస్తున్నారు. రోజుకు 18 గంటల పాటు కష్టపడి పవన్ ఈ సినిమా కోసం పనిచేశారు కాబట్టి, ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ పక్కా కమర్షియల్ మీల్స్ లాగా వర్కౌట్ అవుతాయి. మొత్తమ్మీద చూసుకుంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒక రాజకీయ అస్త్రంలా కాకుండా.. అభిమానులకు సగటు, అలాగే ప్రేక్షకులకు ఒక పూర్తి స్థాయి విందు భోజనంలా రాబోతోంది. రాజకీయాలకు, సినిమాకు మధ్య స్పష్టమైన గీత గీయడం పవన్ కళ్యాణ్ మెచ్యూరిటీని సూచిస్తుంది. కేవలం ఎలివేషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే నమ్ముకుని బరిలోకి దిగుతున్న ఈ చిత్రం.. కంటెంట్ బలంగా ఉంటే పొలిటికల్ వివాదాలతో పనిలేకుండానే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటగలదు. మార్చి 26న విడుదల కానుంది ఈ చిత్రం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *