బిస్కెట్లు, సబ్బులు, నూనెలు, ప్యాకేజ్డ్ ఫుడ్ వంటి రోజువారీ ఇంట్లో ఉపయోగించే నిత్యావసర వస్తువుల ధరలు చౌకగా మారే అవకాశముంది. దేశంలోని ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ మేరకు ధరలను తగ్గించేందుకు ముందడుగు వేస్తున్నాయి. ఇటీవల వస్తువుల తయారీకి అవసరమయ్యే ముడి సరుకు ధరలు పెరగ్గా.. ఇప్పుడు పరిస్ధితి కాస్త మెరుగుపడుతుంది. ఇప్పుడిప్పుడు ముడి పదార్థాల ధరలు తగ్గుతూ వస్తున్నాయి.