పానీపూరీని ఇలా కూడా సర్వ్‌ చేయొచ్చా..!? వాటర్‌గన్‌తో వార్‌మ్యాన్ స్టైల్‌లో..

పానీపూరీని ఇలా కూడా సర్వ్‌ చేయొచ్చా..!? వాటర్‌గన్‌తో వార్‌మ్యాన్ స్టైల్‌లో..


పానీపూరీని ఇలా కూడా సర్వ్‌ చేయొచ్చా..!? వాటర్‌గన్‌తో వార్‌మ్యాన్ స్టైల్‌లో..

పానీపూరీ.. దాదాపు అందరికీ ఇష్టమైన చిరుతిండి.. సాయంత్రం అయిందంటే.. చాలు చాలా మంది వీధుల్లో విక్రయించే చాట్‌ బండి వద్ద క్యూ కడుతుంటారు. గుండ్రగా ఉబ్బి ఉన్న పూరీలు విత్‌ పానీ టేస్ట్‌ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు కట్టిపడవేస్తుంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో పానీ పూరీ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. పారీపూరీ సర్వ్‌ చేస్తున్న స్టైల్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఒక వ్యక్తి అత్యంత అసాధారణ రీతిలో పానీ పూరీని ప్రజలకు వడ్డిస్తున్న దృశ్యం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. అది చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. ఆశ్చర్యంతో నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకో ఇక్కడ చూద్దాం…

ముంబైకి చెందిన ఇక పానీపూరీ వ్యాపారి అసాధారణమైన రీతీలో సర్వ్‌ చేస్తూ అందర్ని ఆకర్షిస్తున్నాడు. ఆఖరికి అతడి వేషం కూడా పూర్తి విభిన్నంగా ఉంది. వాటర్‌గన్‌తో వార్‌మ్యాన్ స్టైల్‌లో వినూత్న రీతిలో పానీపూరీ వడ్డిస్తున్నాడు. బార్డర్‌లో యుద్ధం చేసే సైనికుల మాదిరి పవర్‌ఫుల్‌ వార్‌మ్యాన్‌లా దుస్తులు ధరించి చేతిలో సూపర్‌సోకర్‌ వాటర్‌గన్‌తో ప్రజలకు పానీపూరీని సర్వ్‌ చేస్తున్నాడు. ఆలుకర్రీ స్టఫ్‌తో ఉన్న పానీపూరీలోకి మసాలా నీటిని గరిటెతో కాకుండా..ఇలా వాటర్‌గన్‌తో సర్వ్‌ చేస్తున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Sakshi Gadhave | Food ,Travel & Experiences (@victual_diaries)

అంతేకాదు..వాటర్‌ గన్‌తో పానీని కొందరికీ నేరుగా నోటిలోకే వచ్చేలా అందిస్తున్నాడు. దీంతో కస్టమర్లు సైతం ఆ విధానాన్ని ఇష్టంగా ఆస్వాదిస్తున్నారు. ఒకరకంగా ఇలాంటి విచిత్రమైన శైలిని చూసి.. జనాలు ఎగబడి మరి అక్కడకు వచ్చి పానీపూరీలని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది మార్కెటింగ్‌ ట్రిక్‌ అంటున్నారు చాలా మంది నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *